Vishal Fire: ఇళయరాజాపై దర్శకుడి వ్యాఖ్యలు.. మండిపడ్డ విశాల్
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:04 PM
నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ (Hero Vishal) . దర్శకుడు మిస్కిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిధంగా వ్యవహరించడం మిస్కిన్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.
మాస్ట్రో ఇళయరాజాపై(Ilaiyaraaja) వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనంతరం క్షమాపణలు చెప్పారు తమిళ దర్శకుడు మిస్కిన్ (Director Miskin). ఈ విషయంపై తాజాగా నటుడు, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ (Hero Vishal) స్పందించారు. దర్శకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిధంగా వ్యవహరించడం మిస్కిన్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్ చేయడం సరికాదని సలహా ఇచ్చారు. ‘‘అమర్యాదగా మాట్లాడేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు పరిపాటిగా మారింది. మనసుకు అనిపించిన విషయాన్ని మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు, స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు ఒక పద్థతి ఉంటుంది. ఇళయరాజాను ఎంతోమంది ఆరాధిస్తుంటారు. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నేను ఏ మాత్రం క్షమించను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత రోజు క్షమాపణలు చెబితే మీరు అంగీకరిస్తారా?’’ అని విశాల్ ప్రశ్నించారు.
మిస్కిన్ ఏం మాట్లాడరంటే..!
విశాల్ హీరోగా నటించిన ‘తుప్పారివాలన్’తో మిస్కిన్ తెలుగు వారికి సుపరిచితులయ్యారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ వర్క్ చేస్తున్నారు. ఇటీవల ‘బాటిల్ రాధా’’ అనే సినిమా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే తానే ఎక్కువగా మద్యం తాగుతానని తెలిపారు. అనంతరం ఇళయరాజా గురించి మాట్లాడారు. ఇళయరాజా సంగీతం వల్ల ఎంతోమంది మద్యానికి బానిసలయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఇళయరాజా అభిమానులు మిస్కన్‌పై మండిపడ్డారు. దీంతో ఆ తర్వాత రోజు క్షమాపణలు చె్క్ష?్పరు. తన ఉద్దేశాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను ఎంతో సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.