Darshan: నిద్రలేని రాత్రులు.. ఆధ్యాత్మికత అందుకేనా..

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:22 AM

కర్ణాటకలో రేణుకా’స్వామి (renuka Swami)హత్య కేసులో రెండవ నిందితుడు, నటుడు దర్శన్‌ (Darshan) ఆలయాల బాట పడ్డారు. 


కర్ణాటకలో రేణుకా’స్వామి (renuka Swami)హత్య కేసులో రెండవ నిందితుడు, నటుడు దర్శన్‌ (Darshan) ఆలయాల బాట పడ్డారు.  శ్రీరంగపట్టణం తాలుకా ఆరతి ఉక్కడలో వెలిసిన శ్రీ అహల్య దేవి మారెమ్మ దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు నిర్వహించారు. విజయలక్ష్మి, కుమారునితో కలిసి ఆలయానికి వచ్చారు. మేలుకోటె ఎమ్మెల్యే దర్శన్‌ పుట్టణ్ణయ్యతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.  ఇప్పటికే బళ్లారి జిల్లా కురుగోడు లోని బసవేశ్వర ఆలయంలో కూడా ఆయన పూజలు నిర్వహించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆయన నిత్యం ఏదో గుడికి వెళ్తూ కనిపిస్తూ ఉండటంతో ఆయనలో భక్తి చింతన ఎక్కువగా కనిపిస్తుందని నెటిజన్లు (Renuka Swami Murder) అభిప్రాయపడుతున్నారు. కన్నడలో సంచలనం సృష్టించిన దర్శన్‌ వీరాభిమాని రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్‌, పవిత్రగౌడ సుమారు ఆరు నెలల పాటు జైల్లో ఉండి ఇటీవల బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్యకు సంబంధించి   దర్శన్‌ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దర్శన్‌  జైల్లో ఉన్నప్పుడు  నిద్రలేని రాత్రులు గడిపినట్లు శాండల్‌వుడ్‌ మీడియా పేర్కొంది. దీనంతటికి కారణం రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకా స్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొచ్చినట్లు సమాచారం. దాంతో జైలు బారికేడ్‌లో ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెప్పినట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. అర్థరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్‌ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెప్పారని సమాచారం. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

Updated Date - Jan 17 , 2025 | 08:22 AM