Chiyaan Vikram: రంగస్థలం లాంటి రస్టిక్ సినిమా ఇది 

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:52 PM

మాస్ సినిమాలు చేస్తున్నాను కానీ రస్టిక్ గా ఉండే సినిమా చేసి చాలా రోజులైంది. ఫ్యాన్స్ కోసం మంచి రస్టిక్ యాక్షన్ ఉన్న ఒక సినిమా చేయాలని నేను డైరెక్టర్ అరుణ్ అనుకున్నాం. యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది

చియాన్ విక్రమ్ (Vikram)హీరోగా నటిస్తున్న చిత్రం  'వీర ధీర సూరన్' (Veera Dheera Sooran). ఎస్.యు. అరుణ్ కుమార్ (SU Arun kumar)దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య (SJ Surya), సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్,  ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస రెస్పాన్స్ వచ్చింది. ఎన్.వి.ఆర్ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకోగా, నైజాం రిలీజ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జరుగుతుంది. మార్చి 27న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ "మాస్ సినిమాలు చేస్తున్నాను కానీ రస్టిక్ గా ఉండే సినిమా చేసి చాలా రోజులైంది. ఫ్యాన్స్ కోసం మంచి రస్టిక్ యాక్షన్ ఉన్న ఒక సినిమా చేయాలని నేను డైరెక్టర్ అరుణ్ అనుకున్నాం. యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చేయడానికి మంచి పెర్ఫార్మర్స్ కావాలి. ఈ సినిమా కోసం మేము ఫస్ట్ అప్రోచ్ అయిన యాక్టర్ సూర్య గారు. ఆయన ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్యారెక్టర్ కి సూర్య గారు అయితేనే పర్ఫెక్ట్ . నేను ఎస్ జె సూర్య గారి సినిమాలకి పెద్ద  ఫ్యాన్ ని. యాక్టర్ గా ఆయన చాలా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు. ఒక పాత్రతో మరో పాత్రకి చాలా వైరుధ్యం ఉంటుంది. యాక్టర్ గా ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో సూర్య గారితో కలసి యాక్ట్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ .తుషార డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ మెమొరబుల్ గా ఉంటాయి. యెన్.వి   ప్రసాద్ గారు లక్కీ హ్యాండ్. ఆయన మా సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది డిఫరెంట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒక ఆడియన్స్ ఇలాంటి సినిమాని చూడడానికి ఇష్టపడతాను. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ బాగా కుదిరింది. ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని గ్రాండ్ గా నర్మించారు. తెలుగులో అన్ని రకాల సినిమాలు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్నాయి. యాక్టర్స్ కి ఇది చాలా గొప్ప అవకాశం. అన్ని రకాల పాత్రలు చేసే ఛాన్స్ ఉంటుంది .ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలైపోతుంది. అందుచేత ఒక ఫైవ్ మినిట్స్ ముందే థియేటర్ లో వుండేలా చూసుకోవాలని ప్రేక్షకులుని కోరుతున్నాను. తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ అద్భుతం. వారి ప్రేమకి నా కృతజ్ఞతలు" అని అన్నారు. 


 


యస్ జె సూర్య మాట్లాడుతూ " ట్రైలర్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కంటెంట్ ఎక్కడున్నా సరే తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ అంటే డైరెక్టర్ అరుణ్ గారికి చాలా పిచ్చి. ఒకవేళ మార్టిన్ స్కోర్సెస్ రాజమండ్రిలో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. రంగస్థలం లాంటి రా అండ్ రస్టిక్ సినిమా ఇది. ఇక్కడ స్పైడర్ సినిమా చేశాను. అలాగే చాలా సినిమాలు డబ్బింగ్ రూపంలో వచ్చాయి. అన్ని పాత్రలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని గారితో చేసిన సరిపోదా శనివారం సినిమాకి ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఖుషి సినిమాతో డైరెక్టర్ గా ఎంత మంచి స్థాయి దొరికిందో యాక్టర్ గా సరిపోదా శనివారంతో అలాంటి ఆదరణ తెలుగులో లభించింది. వీరధీరలో  నా క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. అరుణ్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాలో 16 మినిట్స్ డ్యూరేషన్ గల ఒక సింగిల్ షాట్ ఉంది. ఆ షాట్ కోసం చాలా రిహారల్స్ చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక రాత్రంతా ఆ షాట్ తీస్తూనే ఉన్నాం. ఆ షాట్ గురించి చెప్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా మీరు థియేటర్స్ లో చూడాల్సిందే. మీలానే నేను విక్రమ్ గారికి అభిమానిని. విక్రమ్ గారు లాంటి యాక్టర్ ఉండడం మన సౌత్ ఇండస్ట్రీకి గర్వకారణం" అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ "మహారాజా తర్వాత మేము తెలుగులో చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. ప్రేక్షకులు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. విక్రమ్ గారు తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకున్నారు. ఎస్ జె సూర్య గారు నాకు చాలా బాకీ పడి ఉన్నారు. ఆయన్ని విలన్ గా పరిచయం చేసింది నేనే. (నవ్వుతూ). జీవి ప్రకాష్ కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. ఆడియన్స్ అందరూ ఆదరించి ఈ సినిమాని సెన్సేషనల్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు

ALSO READ: Nabha Natesh: నభా జీవితంలో ఊహించని సినిమాటిక్‌ ట్విస్ట్‌ ఏంటి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2025 | 12:55 PM