నటుడు విశాల్‌ చెల్లి భర్తపై సీబీఐ కేసు  

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:50 PM

నకిలీ పత్రాలతో నగదు మోసానికి పాల్పడినందుకు నటుడు విశాల్‌ చెల్లి భర్త  క్రితీష  తో పాటు ఆయన నడుపుతున్న ఉమ్మిడి బంగారు జ్యూవెలర్స్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.


నకిలీ పత్రాలతో (Fake Documents) నగదు మోసానికి పాల్పడినందుకు నటుడు విశాల్‌ (Vishal) చెల్లి భర్త  క్రితీష  తో పాటు ఆయన నడుపుతున్న ఉమ్మిడి బంగారు జ్యూవెలర్స్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు ఐశ్వర్య అనే సోదరి ఉన్నారు. ఆమెకు బంగారు దుకాణం వ్యాపారి ఉమ్మిడి క్రితీషకు 2017లో వివాహం జరిగింది.ఈనేపథ్యం లో  క్రితీష  పై సీబీఐ కేసు నమోదు చేసింది. అయ్యప్పన్‌ తాంగల్‌లో ఉన్న ఓ బ్యాంకులో నకిలీ పత్రాలతో రూ.5.5 కోట్ల మేర రుణం తీసుకోవడంతో పాటు రూ.2.5 కోట్ల నగదు కూడా తీసుకుని మోసం చేసినట్టు తేలడంతో కేసు నమోదు చేశారు. అలాగే, ఒక స్థల యజమాని, భవన నిర్మాణ యజమాని, బ్యాంకు అధికారులతో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 22 , 2025 | 12:50 PM