Ashwath Marimuthu: మహేశ్ ఒక్క ట్వీట్‌తో అకౌంట్ ఫేమస్ అయిపోయింది
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:41 AM
2020లో నా ట్విటర్ ఖాతాకు ఎప్పుడూ లేనన్ని వ్యూస్ వచ్చాయి. ఏమైందో అర్థం కాలేదు. నేను దర్శకత్వం వహించిన ‘ఓహ్ మై కడవులే’ సినిమా బాగుందని మహేశ్ పోస్ట్ పెట్టారని..
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ (Ruturn of Dragon) పేరుతో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ మహేశ్‌బాబుతో (mahesh Babu)సినిమా తీయాలనుందన్నారు. అందుకు కారణాన్ని చెప్పారు.
‘‘2020లో నా ట్విటర్ ఖాతాకు ఎప్పుడూ లేనన్ని వ్యూస్ వచ్చాయి. ఏమైందో అర్థం కాలేదు. నేను దర్శకత్వం వహించిన ‘ఓహ్ మై కడవులే’ సినిమా బాగుందని మహేశ్ పోస్ట్ పెట్టారని అందుకే నా అకౌంట్ ఫేమస్ అయిందని తర్వాత తెలిసింది. ఆ ట్వీట్‌లో ఆయన నాపై ప్రశంసలు కురిపించారు. అది చాలా చిన్న సినిమా. రూ.3 కోట్లతో రూపొందించాం. మేము అడగకుండానే మహేశ్ ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత తెలుగు దర్శకులు, నటీనటులు కూడా ఎంతోమంది దాన్ని చూసి మా టీమ్‌ను అభినందించారు. అప్పటినుంచి మహేశ్ ఒక్క ఛాన్స్ ఇస్తే అతనితో సినిమా తీయాలని అనుకుంటున్నా’’ (Mahesh Tweet Famous) అని అన్నారు.
ఇంకా ఈ వేడుకలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడి అందరిరీ ఆకట్టుకున్నారు. తెలుగు ఆడియన్స్‌కు తాను ఇచ్చే బహుమతి ఇదేనన్నారు. ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ కథను తెలుగులో వివరించారు. ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ALSO READ: SKN Viral Comments: తెలుగు హీరోయిన్లపై నిర్మాత వ్యాఖ్యలు వైరల్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి