AR Rahman: ఏఆర్ రెహమాన్ అస్వస్థత.. ఏమైందంటే
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:59 AM
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఏమైందంటే...
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఇబ్బంది పడిన ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రికి (AR rahman hospitalised) తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు రెహమాన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. రంజాన్ మాసం కావడంతో ఉపవాసం ఉండటం వల్ల బాడీ డీహైడ్రేట్ (dehydration) అయిందని వైద్యులు తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే.. రెహమాన్ ఇటీవల ‘ఛావా’ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘ఆర్‌సీ 16’ కోసం వర్క్ చేస్తున్నారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక. దీని కోసం ఇప్పటికే తాను రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఇటీవల వెల్లడించారు.
ALSO READ: Saptagiri: మహారాజు లాంటి మనస్తత్వం ఆయనది
Mikey Madison - Oscar: చిన్న వయసులో చరిత్రకెక్కింది
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి