Teacher in Ott: ఓటీటీలో విజృంభిస్తున్న అమలాపాల్
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:34 PM
ఇందులో అమలాపాల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా కనిపించింది. 2022 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదట మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత పుంజుకుని హిట్ కేటగిరీలో చేరింది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.
అమలాపాల్ (Amala Paul) కీలక పాత్రలో వివేక్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'ది టీచర్' (The Teacher). రెండేళ్ల కిందట థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనకు పరిమితమైంది. ఇందులో అమలాపాల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా కనిపించింది. 2022 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదట మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత పుంజుకుని హిట్ కేటగిరీలో చేరింది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమా విపరీతంగా ఆదరిస్తున్నారు. ఓ టీచర్ తనకు అన్యాయం చేసిన నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్న కథా ఆచఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వివేక్. పక్కా మలయాళం మార్క్ రివేంజ్ థ్రిల్లర్ (Revange Story) మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రెగ్యులర్ రివేంజ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో దేవిక అనే టీచర్ పాత్ర అమలాపాల్‌కు చక్కని ప్రశంసలు తీసుకొచ్చింది. ఊహకందని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అయ్యింది. థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఎక్కువ నచ్చుతుంది. ఇందులో హకీమ్ షా, చెంబన్ వినోద్ జోష్, మంజు పిళ్లై కీలక పాత్రలు పోషించారు.
కధేంటి:
దేవిక (అమలా పాల్) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఓ రోజు స్కూల్లో ఈవెంట్ తర్వాత ఆమె తిరిగి ఇంటికి వెళ్తుండగా మరుసటి రోజు తన శరీరంపై ఉన్న గాయాలు చూసి షాకవుతుంది. అసలు ఆరోజు తనకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఓ స్టూడెంట్ ఇంటికి వెళ్లగా.. అక్కడ భయంకరమైన నిజం తెలుస్తుంది. తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఎలా పోరాడింది? కట్టుకున్న భర్త వదిలేసినా అత్త ఇచ్చిన ధైర్యంతో జరిగిన అన్యాయంపై ఎలా ఫైట్ చేసింది. ఆ అన్యాయానికి పాల్పడిన నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నది కథ.