Ajith: దుబాయిలో భారత జెండా ఎగురవేశాడు..
ABN , Publish Date - Jan 12 , 2025 | 07:15 PM
తలా అజిత్‌కు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నూతన సంవత్సరంలో ఆయన ప్రత్యేక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను ప్రకటించిన ఆయన తాజాగా తన టీమ్‌తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు.
తలా అజిత్‌కు (Ajithkumar) రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నూతన సంవత్సరంలో ఆయన ప్రత్యేక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ (Car racing Team) టీమ్‌ను ప్రకటించిన ఆయన తాజాగా తన టీమ్‌తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేసులో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. స్పిరిట్ ఆఫ్ రేస్ (Dubai Car racing) అనే అవార్డును ఆయనకు టీమ్ బహుకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు అజిత్‌కు అభినందనలు చెబుతున్నారు. బైక్, కార్ల రేసింగ్‌కు ఎంతగానో ఇష్టపడే అజిత్.. 13ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్‌లో పాల్గొన్నారు. ఈ రేసు కోసం ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తున్నారు. ఇటీవల ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. గోడను బలంగా ఢీ కొనడంతో కారు ముందు భాగం డ్యామేజ్‌కు గురైంది. బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది.
ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని చిత్ర బృందం చెప్పింది. ఇది కాకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ బాషల్లో విడుదల కానుంది.