Ajith kumar: నాతోనే ఉండి నడిపిస్తున్నారనుకుంటున్నాను
ABN , Publish Date - Jan 26 , 2025 | 09:36 AM
25 ఏళ్ల నుంచి నా భార్య శాలిని సహకారంతోనే ఇలా ఉన్నాను. నా విజయానికి, సంతోషానికి ఆమె ప్రధాన కారణం. చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి - Ajithkumar
సినీ పరిశ్రమకు చేసిన సేవలకు అజిత్ కుమార్‌ను(Ajith Kumar) కేంద్రం దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌తో (PadmaBhushan Ajith) సత్కరించింది. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఉండి ఉంటే ఎంతో ఆనందించేవారని భావోద్వేగానికి గురయ్యారు. (Thala Ajith)
‘‘పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా. సినీ పరిశ్రమలో ఎంతో మంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. వారందరి ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగ్‌లో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు. నా కుటుంబం,స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తోంది. నన్ను చూసి ఆయన గర్వపడేవారు. భౌతికంగా మా మధ్య లేకపోయినా.. నేటికి ఆయన నాతోనే ఉన్నారని అనుకుంటున్నాను. 25 ఏళ్ల నుంచి నా భార్య శాలిని సహకారంతోనే ఇలా ఉన్నాను. నా విజయానికి, సంతోషానికి ఆమె ప్రధాన కారణం. చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి. మీ అచంచలమైన ప్రేమ, మద్దతు కారణంగానే నేను అంకితభావంతో పని చేయగలుగుతున్నా. ఈ అవార్డు మీ అందరిది. మీ అందరికీ వినోదాన్ని అందించడానికి ఇలానే కష్టపడుతూ ఉంటాను’’ అని ఆనందం వ్యక్తం చేశారు.