Ajith Kumar : మళ్లీ మాస్ కే అజిత్ ఓటు

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:54 PM

అజిత్ నటించిన తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. దీని తర్వాత చిత్రాన్ని కూడా అదే డైరెక్టర్ కు అజిత్ చేయబోతున్నాడట.

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మైంటైన్ చేస్తూ వరుస ప్రాజెక్టులతో దూకుడు చూపిస్తున్నాడు అజిత్ (Ajith). రీసెంట్ గా ఆయన నటించిన విదాముయార్చి ఫిబ్రవరి మొదటివారం విడుదలై ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. 'పట్టుదల'గా తెలుగులో డబ్ అయిన ఆ మూవీ ఇక్కడా ఘోర పరాజయం పాలైంది. దీంతో గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly) పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు అజిత్ ఫ్యాన్స్. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ప్రమోషన్ కంటెంట్ ఉండటంతో పాటు మాస్ అవతార్ లో అదరగొట్టేశాడు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత అజిత్ చేయబోయ నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Balakrishna: బాలయ్యతో బోయపాటి ఆ క్రెడిట్ కొట్టేస్తాడా?


అజిత్ కాల్షిట్ల కోసం బడా డైరెక్టర్లు క్యూ లో నిలబడ్డారు. ప్రశాంత్ నీల్ (Prasanth neel), విష్ణువర్ధన్ (Vishnuvardhan), వెంకట్ ప్రభు (Venkat Prabhu), శంకర్ (Shankar), కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) పేర్లు గట్టిగావినిపిస్తున్నాయి. కానీ అజిత్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తోనే చేయనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రెజెంట్ అజిత్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఈ పోటీలు ముగిసిన తర్వాత మళ్లీ సినిమాలకు రెడీ అవుతాడట. ఈ లెక్కన అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read: Friday Movies: ఈ వారం ఆరు వైవిధ్యమైన చిత్రాలు


అధిక్ రవిచంద్రన్.. అజిత్‌ కోసం ఓ మాస్‌ కథ రాసుకున్నారట. నెవర్ బిఫోర్ అనే కాన్పెప్ట్ తో మూవీ రానుందట. ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ సమయంలో అజిత్ కు స్టోరీ వినిపించగా... గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అజిత్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారట. అజిత్ వర్క్ మోడ్ లోకి వచ్చేందుకు చాలా సమయం ఉండటంతో పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేయాలను కుంటున్నారట. బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అధికార ప్రకటన రానప్పటికి... అజిత్ 64వ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది.

Also Read: RAPO: చందూతో సినిమా.. రామ్‌ రెడీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 05:54 PM