Rohini: కెరీర్‌లో ది బెస్ట్ పాత్ర ఇదే
ABN , Publish Date - Feb 11 , 2025 | 08:26 AM
. ‘ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదని, రెండు స్వచ్ఛమైన హృదయాల మధ్య ఉండేదని, అలాంటి ప్రేమను గౌరవిస్తూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుందాం’ అనే కాన్సెప్టుతో తెరకెక్కించారు. ఈ నెల 14వ తేదీ రిలీజ్ కానుంది.
తాను హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గత రెండు మూడు దశాబ్దాల నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నానని, కానీ, తన సినీ కెరీర్‌లో తాను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ‘లక్ష్మి’ (lakshmi) అనే పాత్ర ‘ది బెస్ట్’ క్యారెక్టర్ అని సీనియర్ సినీ నటి రోహిణి (Actrees Rohini) అన్నారు. ‘లెన్స్’, ‘తలైక్కూత్తల్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ (Jaya Prakash Radha Krishnan) ‘కాదల్ ఎన్బదు పొదువుడమై’ (kadhal enbathu podhuvudamai) అనే పేరుతో ఇద్దరు యువతుల మధ్య ప్రేమను వివరిస్తూ రూపొందించారు. ‘ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదని, రెండు స్వచ్ఛమైన హృదయాల మధ్య ఉండేదని, అలాంటి ప్రేమను గౌరవిస్తూ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుందాం’ అనే కాన్సెప్టుతో తెరకెక్కించారు. ఈ నెల 14వ తేదీ రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ఆడియో ట్రైలర్ రిలీజ్ చేశారు.
నటి రోహిణి (Rohini మాట్లాడుతూ ‘'నాకు తమిళంలో కంటే తెలుగులో అనేక సక్సె్‌సఫుల్ చిత్రాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి. తమిళంలో అలాంటి పాత్రలు రావాలని కోరుకుంటున్నారు. నా సినీ కెరీర్‌లో ‘ది బెస్ట్’ పాత్రను ఈ మూవీలో పోషించాను. ఇలాంటి చిత్రాలు మలయాళంలోనే కాదు.. తమిళంలో కూడా రావాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన పాత్ర పోషించిన లిజోమోల్ జోస్ మాట్లాడుతూ, ‘నాకు క్యారెక్టర్ నచ్చితే బోల్డ్ పాత్రలోనైనా నటిస్తాను. ఈ సినిమాలో నా పాత్ర అలాంటిదే. ముద్దు సీన్లతో పాటు పలు సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించడానికి ప్రధాన కారణం ఆ పాత్ర నాకు బాగా నచ్చింది’ అన్నారు. దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ‘సమాజంలో స్త్రీ, పురుషుడు అనే లింగభేదం మినహా ప్రతి ఒక్కరూ సమానమే. లెస్బియన్స్‌లోనే కాదు ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ ఒక్కటే. వీరి పట్ల సమాజం చిన్నచూపు చూస్తుంది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
లిజోమోల్ జోస్, రోహిణి, వినీత్, కలేస్ రామానంద్, అనూష, దీపా తదితరులు నటించారు. జమన్ జాకబ్, నిత్య అద్భుతరాజ్, డిజో అగస్త్యన్, విష్ణు రాజ్ నిర్మాతలు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ధనుంజయన్ రిలీజ్ చేస్తున్నారు.