Sivakarthikeyan: మలయాళ దర్శకుడితో.. శివ కార్తికేయన్
ABN , Publish Date - Mar 09 , 2025 | 11:10 AM
ఇటీవల కాలంలో ఓ భాషలో సినిమా హిట్ అయితే ఆయా దర్శకులతో సినిమా చేసేందుకు ఆరాట పడుతున్నారు హీరోలు. భాషతో సంబంధం లేకుండా సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు
ఇటీవల కాలంలో ఓ భాషలో సినిమా హిట్ అయితే ఆయా దర్శకులతో సినిమా చేసేందుకు ఆరాట పడుతున్నారు హీరోలు. భాషతో సంబంధం లేకుండా సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు. తెలుగు హీరో- తమిళ దర్శకుడు, తమిళ హీరో - మలయాళ దర్శకుడు ఇలా కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక కాంబినేషన్ సెట్ అయిందని తెలుస్తోంది. ‘అమరన్’ (Amaran) విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు శివ కార్తికేయన్. దీంతో ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేసేందుకు పరభాషా దర్శకులు కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పుడాయన మలయాళ దర్శకుడు చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. (Siva Karthikeyan New movie)
‘2018’(2018 Movie) విజయంతో ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్. తాజా సమాచారం ప్రకారం అయన దర్శకత్వంలోనే శివ కార్తికేయన్‌తో ఓ చిత్రం చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దీన్ని నిర్మించే అవకాశముందని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం ఆర్య పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తికేయన్ నటించిన ‘మదరాసి’ (madarasi) విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘పరాశక్తి’ చిత్రీకరణ దశలో ఉంది.