ఇంటర్నెట్ డెస్క్: ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi).. చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఆ చిత్రం ప్రారంభమైంది. హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు.