Crime Drama: టచ్ మీ నాట్ అంటున్న నవదీప్
ABN , Publish Date - Mar 20 , 2025 | 06:21 PM
నాగశౌర్య హీరోగా 'అశ్వద్ధామ' చిత్రాన్ని తెరకెక్కించిన రమణ తేజ రూపొందించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్ 'టచ్ మీ నాట్'. సునీత తాటి నిర్మించిన ఈ సీరిస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
నవదీప్ (Navdeep), దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) ప్రధాన పాత్రలు పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీరిస్ 'టచ్ మీ నాట్' (Touch Me Not). 'అశ్వత్థామ' మూవీ ఫేమ్ రమణ తేజ (Ramana Teja) తెరకెక్కించిన ఈ సీరిస్ లో బబ్లూ పృథ్వీరాజ్, కోమలి ప్రసాద్, సంచిత పూనాంచ, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 4 నుండి ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది.
'టచ్ మీ నాట్' ట్రైలర్‌ను గమనిస్తే ఈ సిరీస్ ఒక అత్యంత సున్నితమైన క్రైమ్ సంబంధిత విషయం చుట్టూ తిరుగుతుందని అర్థమౌతోంది. ట్రైలర్‌లో దీక్షిత్ శెట్టి సైకోమెట్రిక్ సామర్థ్యాలు కలిగిన పాత్రలో కనిపించాడు. అతను పోలీసులకు సహాయం చేస్తూ, బాధితుల తలలను తాకడం ద్వారా హంతకులను కనుగొనడానికి తన సైకోమెట్రీని ఉపయోగిస్తున్నట్లు చూపించారు. ఒక రహస్యం, అనేక ట్విస్ట్‌లతో సిరీస్ ముందుకు సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ రహస్యమైన క్రైమ్‌ను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు ఆ దెయ్యాన్ని వెంబడిస్తారు? అనేదే అసలు ట్విస్ట్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందిన సీరిస్ పై తాజా ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించే ఎవరైనా చావును ఎదుర్కొవాల్సి వస్తుందనేదే ఈ రహస్యమైన కేసు కథలో ప్రధాన భాగం. ఈ సిరీస్‌ను సునీత తాటి (Sunitha Tati) గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Also Read: Erra Cheera: 'ఎర్రచీర' కట్టుకున్నదెవరి కోసం...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి