KanKhajura Ott: ఇంట్రెస్టింగ్ ఇజ్రాయిల్ థ్రిల్లర్ రిమేక్.. ఓటీటీకి! ఎందులో.. ఎప్పటినుంచంటే?
ABN , Publish Date - May 13 , 2025 | 06:22 PM
ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఓ ఆసక్తికరమైన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్ ‘కన్‌ఖజురా’ (Kankhajura) ముస్తాబైంది.
ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఓ ఆసక్తికరమైన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్ ‘కన్‌ఖజురా’ (Kankhajura) ముస్తాబైంది. ఆరేండ్ల క్రితం 2019లో ఇజ్రాయిల్ వచ్చి పెద్దెత్తున విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘మాగ్పీ’ (Magpie) సిరీస్‌ను హందీలో రిమేక్ చేస్తూ ఇక్కడ నేటివిటికి అనుగుణంగా తెరకెక్కించారు. సిరీస్ మొత్తం గోవా నేపథ్యంలో అక్కడ జరిగే నేరాల చుట్టూ తిరుగుతూనే విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే పోరు.. వారిని వెంటాడే చీకటి గతం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ ఉండనుంది.
ప్రముఖ మలయాళ నటుడు రోషన్ మాథ్యూ (Roshan Mathew), మోహిత్ రైనా (Mohit Raina), సారా జేన్ డయాస్ (Sarah Jane Dias), మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా కీలక పాత్రల్లో నటించగా చందన్ అరోరా దర్శకత్వం వహించాడు. మే 2న విడుదల చేసిన ఈ ‘కన్‌ఖజురా’ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. కేవలవ వారం వ్యవధిలోనే సుమారు నాలుగు మిలియన్ల వ్యూస్ దక్కించుకుని సంచలనం సృష్టించడమే కాక సిరీస్‌పై అంచనాలను మరింతగా పెంచాయి.
ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. ‘కన్‌ఖజురా’ (Kankhajura) లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఈ కథలోని భావోద్వేగం వంటి అంశాలు ఇందులో నన్ను నటించేలా చేశాయన్నారు. అషు అనే పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయని, క్షణానికో రకంగా మారుతుంటుందని..ఈ కథ అందరి హృదయాల్ని కదిలించది.. వెంటాడుతుంది’ అని అన్నారు. కాగా ఈ ‘కన్‌ఖజురా’ సిరీస్ మే 30 నుంచి సోనీ LIV (Sony LIV) ఓటీటీలో ప్రసారం కానుంది.