The Family Man 3: వాటర్ ఫాల్స్ లో పడి నటుడి మృతి
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:22 AM
ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న వెబ్ సీరిస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో కీలక పాత్ర పోషించిన అస్సామీ నటుడు రోహిత్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్, డీకే (Raj D.K.) తెరకెక్కించిన 'ఫ్యామిలీ మ్యాన్' (Family Man) వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి (Priyamani) కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ రెండో సీజన్ లో నటి సమంత (Samantha) కీ-రోల్ ప్లే చేసింది. దీంతో సెకండ్ సీజన్ సైతం చక్కని ఆదరణను పొందింది. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కు రాజ్ అండ్ డీకే తుదిమెరుగులు దిద్దుతున్నారు. అయితే... ఇంతలోనే ఓ దుర్ఘటన జరిగింది. ఈ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషిస్తున్న అస్సామీ నటుడు రోహిత్ బాస్ఫోర్ (Actor Rohit Basfore) అనుమానాస్పద పరిస్థితిలో కన్నుమూశాడు.
ఏప్రిల్ 27న తొమ్మిది మంది స్నేహితులతో కలసి రోహిత్ గర్భంగా వాటర్ ఫాల్స్ కు వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు అతను మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పడిపోయాడని స్నేహితులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు వారు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. 4.30కి సంఘటనా స్థలానికి చేరిన ఎస్.డి.ఆర్.ఎఫ్. టీమ్ సాయంత్రం 6.30కి రోహిత్ మృతదేశాన్ని వాటర్ ఫాల్స్ నుంచి బయటకు తీరిసింది. ఈ విషయాన్ని రాణి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తు రోహిత్ వాటర్ ఫాల్స్ లో పడి చనిపోయాడని భావించిన పోలీసులు, అతని కుటుంబ సభ్యులు మరణంపై పలు అనుమానాలను వ్యక్తం చేయడంతో కేసును రిజిస్టర్ చేశారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు.
Also Read: ANR: సంగీతాభిమానులకు ఆనందం పంచిన అనార్కలి
Also Read: Anupam Kher: 23 ఏళ్ళ తర్వాత మరోసారి...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి