Thandel - Ott: తండేల్ సందడి ఎప్పుడంటే    

ABN , Publish Date - Mar 02 , 2025 | 06:32 PM

‘తండేల్‌’ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్య కెరీర్‌లోనే మంచి కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన తాజా చిత్రం  ‘తండేల్‌’ (Thandel). శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి, పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు చందూ మొండేటి. సాయిపల్లవి (Sai pallavi) కథానాయిక. ఫిబ్రవరి 7న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్య కెరీర్‌లోనే మంచి కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌కు (Netflix) అందుబాటులోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. ఈ విషయాన్ని  నెట్ ఫ్లిక్  ఎక్స్‌ వేదికగా తెలియజేసింది.


కథ:  

రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) మత్య్సకారులు కుటుంబానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం. సముద్రంలో చేపలు పట్టడం రాజు జీవనాధారం. తొమ్మిది నెలలు సముద్రంలో ఉంటే, మూడు నెలలు ఊర్లో ఉంటాడు. ఆ తొమ్మిది నెలలు రాజు, సత్య ఒకరికోసం ఒకరు విరహవేదనతో రగిలిపోతుంటారు. ఫోన్‌లో మాట్లాడే ఒక్క రోజు కోసం నెలంతా ఎదురు చూస్తుంటారు. ఈ దూరం భరించలేని సత్య, వేటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అనే భయంతో ఇక ముందు వేటకు వెళ్లవద్దని, ఊళ్లోనే ఉండి ఏదైనా పని చూసుకోమని చెబుతుంది. అలాగే అని మాటిచ్చిన రాజు, మళ్లీ సముద్రంలోకి వేటకు వెళ్లిపోతాడు. దాంతో రాజుపై అలకతో అతనికి దూరమవుతుంది. ఇద్దరి మధ్య మాట మంచి ఏమీ ఉండదు. సముద్రంలో వేటకు వెళ్లిన రాజు.. అతని బృందం22 మంది ప్రయాణించే బోటు తుఫాను తాకిడికి పొరపాటున పాకిస్థాన్‌ బోర్డర్‌లోకి ప్రవేశిస్తుంది. దాంతో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. పాకిస్థానీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో సత్య, రాజుల మధ్య దూరం మరింత పెరుగుతుంది. మళ్లీ వారిద్దరూ ఎలా కలిశారు? పాకిస్థాన్‌ చెర నుంచి ఎలా భయపడ్డారు అనేది కథ.

Updated Date - Mar 02 , 2025 | 06:34 PM