Retro: OTTకి వ‌చ్చేసిన‌.. సూర్య లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా! ఆ సీన్లు మాత్రం హైలెట్‌

ABN , Publish Date - May 30 , 2025 | 07:53 AM

నాని హిట్3 సినిమాతో పాటు మే1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన త‌మిళ చిత్రం రెట్రో.

retro

నాని హిట్3 సినిమాతో పాటు మే1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన త‌మిళ చిత్రం రెట్రో (Retro). సూర్య (Suriya), పూజా హెగ్డే (Pooja Hegde) జంట‌గా న‌టించ‌గా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శక‌త్వం వ‌హించాడు. నాజ‌ర్ (Nasser), జోజు జార్జ్ (joju george), ప్ర‌కాశ్ రాజ్ (Prakash Ra), జ‌య‌రాం (Jayaram) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగు వారికి అస‌లు క‌నెక‌ట్్ లాలేక పోయిన ఈ చిత్రం త‌మిళ‌నాట మాత్రం రూ. 200 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టి ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఇప్పుడీ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అయిన పారి అలియాస్‌ పార్వేల్‌ కన్నన్‌ (సూర్య)ను సిటీలో. గ్యాంగ్‌స్టర్‌ తిలక్‌ (జోజు జార్జ్‌) భార్య దగ్గరకు తీసుకుని పెంచుతుంది. తిల‌క్‌కు ఇష్టం లేక పోయినా ఓ ప్ర‌మాదం నుంచి పారి కాపాడడంతో అతన్ని ఐరన్‌ హ్యాండ్‌గా భావించి కొడుకులా చూస్తాడు. ఆపై తిలక్‌తో పాటే పారి కూడా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అనంత‌రం ఈ రౌడీయిజం బంద్ చేస్తాన‌ని మాటిచ్చి చిన్నతనంలో పరిచయమైన రుక్మిణితో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ గ‌త చ‌రిత్ర అత‌న‌ని సాధార‌ణ జీవితం గ‌డ‌ప‌నీయ‌దు. పెళ్లి రోజే పెద్ద గొడ‌వ, రుక్మిణిపై హాత్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో పెళ్లి ర‌ద్దై రుక్మిణి పారికి దూరంగా రాష్ట్రం వ‌దిలి అండ‌మాన్ వెళుతుంది. ఆపై పారి అరెస్టై ఐదేండ్ల జైలులో గ‌డ‌పాల్సి వ‌స్తుంది. ఆపై జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పారి రుక్మిణిని వెతుక్కుంటూ త‌ను ఉన్న ప్రాంతానికి వెళ‌తాడు.

retro.jpg

తీరా అక్క‌డికి వెళ్లాక ఆ ప్రాంతాన్ని పాలించే రాజు, ఆయ‌న కుమారుడు అక్క‌డ‌ ర‌క‌రకాల హింసాత్మ‌క పోటీలు పెట్టి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను బానిస‌లుగా చూస్తుంటారు. మ‌రో వైపు పారి అక్క‌డ రుక్మిణిని మ‌చ్చిక చేసే ప‌నిలో ఉంటూనే కింగ్‌తో క‌లిసి అక్క‌డ గేమ్స్ ఆడుతుంటాడు. ఈ క్ర‌మంలో త‌న జ‌న్మ ర‌హాస్యం తెలిసి రాజుకు ఎదురు తిరుగుతాడు. ఈ నేప‌థ్యంలో ఆ తర్వాత అతనికి ఎదురైన పరిణామాలేంటి? తిలక్ తిరిగి అక్క‌డ‌కు ఎందుకు వ‌చ్చాడు, పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, అస‌లు గోల్డ్‌ ఫిష్‌ గొడవ ఏంటి? ఈ దీవిలో ఉన్న ఊరుకి, పారికి సంబంధం ఏంటి అన్నది కథ.

కార్తీక్‌ సుబ్బరాజ్ అంటెనే స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్‌. మొద‌టి నుంచి మాములు కథలను సైతం వైవిధ్యంగా చెబుతాడ‌నే ప్ర‌త్యేక‌మైన పేరునుసొంతం చేసుకున్నాడు. న్యూ ఏజ్‌ స్టైల్లో అతని చిత్రీకరణ ఉంటుంది. ఈ రెట్రో కూడా అంతే. 1960 – 1993ల మధ్య సాగే కథ‌గా ప్రేమ.. నవ్వు.. యుద్థం.. అని మూడు పార్టులుగా విడదీసి తెరకెక్కించారు. ప్రేమ కోసం హింసకు దూరమైన కథానాయకుడు, మళ్లీ అదే ప్రేమను దక్కించుకోవడానికి అదే దారిలో వెళ్లి యుద్ధం చేయాల్సి వస్తే, బానిసలుగా ఉన్న ఓ జాతిలో నవ్వులు పూయించేందుకు పారి ఏం చేశాడన్నది సినిమా లైన్‌. ఇప్పుడీ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో త‌మిళంతో పాటుగా తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. సినిమా ఆరంభంలోనే సూర్య‌, పూజా, జోజుల మ‌ధ్య వ‌చ్చే 15 నిమిషాల‌ సింగిల్ టేక్ షాట్‌లో పాట‌తో పాటు యాక్ష‌న్‌, డ్రామా సీన్లు తెర‌కెక్కించిన స‌న్నివేశాలు సినిమా మొత్తానికే హైలెట్‌. థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూడ‌ని వారు, కార్తీక్ సుబ్బ‌రాజ్ సినిమాలంటే ఇష్ట ప‌డేవారు ఓ సారి ఈ రెట్రో (Retro) చిత్రాన్ని ఒక్క‌మారు చూడొచ్చు.

Updated Date - May 30 , 2025 | 07:53 AM