Raasii khanna: యేడాది చివరిలో కెమెరా ముందుకు దొంగనోట్ల ముఠా

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:02 PM

షాహిద్ కపూర్, రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించి 'ఫర్జీ' వెబ్ సీరిస్ దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేసే అంశంపై తెరకెక్కింది. దీని రూపకర్తలు రాజ్, డీకే ఇప్పుడు రెండో సీరిస్ కు రంగం సిద్థం చేస్తున్నారు.

రాశీ ఖన్నా (Raashii Khanna), షహీద్ కపూర్ (Shahid Kapoor), కావ్యా ధాపర్ (Kavya Thapar) తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ 'ఫర్జీ' (Farzi). ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థిల్లర్ ను రాజ్ అండ్ డీకే (Raj and DK) రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఈ వెబ్ సీరిస్ 2023లో ప్రైమ్ లో టెలీకాస్ట్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు దీనికి సీజన్ 2 కూడా రూపుదిద్దుకోబోతోంది.

Also Read: NTR, ANR: చరణదాసి కాపీ లాపతా లేడీస్ కు అవార్డుల పంట


ఈ విషయాన్ని గురించి ప్రముఖ కథానాయిక రాశీ ఖన్నా మాట్లాడుతూ, ''ఈ వెబ్ సీరిస్ సీక్వెల్ కోసం ఎంతోకాలంగా చాలామంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారని తెలుసు. ఇటీవలే స్క్రిప్ట్ కు సంబంధించిన వర్క్ పూర్తయ్యింది. సో.. యేడాది చివరిలో చిత్రీకరణ మొదలు కాబోతోంది'' అని తెలిపింది. ఏ పెయింటింగ్ నైనా అచ్చిగుద్దినట్టు గీయగలిగే యువకుడు దొంగ నోట్లను ముద్రించాలని అనుకున్నప్పుడు ఏం జరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథాంశం. ఇందులో రెజీనా కసాండ్రా, కే కే మీనన్, అమోల్ పాలేకర్, భువన్ అరోరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరిలో ఎంతమంది సెకండ్ సీజన్ లో రిపీట్ అవుతారో చూడాలి.

Also Read: Gadar Awards: గద్దర్ సినీ అవార్డుల జ్యూరీ ఏర్పాటు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 12 , 2025 | 12:02 PM