Sankranthiki vastunnam: అదే నిజం అయితే ఇంకా పెద్ద హిట్టే

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:41 PM

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రంతో ఈ సంక్రాంతికి వచ్చి అలరించారు వెంకటేశ్‌. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రంతో ఈ సంక్రాంతికి వచ్చి అలరించారు వెంకటేశ్‌. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌  ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం జీ5లో (Zee 5) ప్రసారం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్‌లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్‌ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వెర్షన్‌లో ఆ సన్నివేశాలన్నిటినీ యాడ్‌ చేయాలని భావిస్తున్నారని తెలిసింది.  మార్చి 1న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారు. ఈ సీన్స్‌ సినిమాకు మరింత బలాన్నిస్తాయని టీమ్‌ భావిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలపనున్నారట. అదే నిజం అయితే  థియేటర్లో సాధించిన విజయం కంటే ఓటీటీ  రెట్టింపు విజయం సాదిస్తుందని చెప్తున్నారు.  ఈ విషయంపై టీమ్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

 

  

Updated Date - Feb 25 , 2025 | 04:41 PM