Sankranthiki Vastunnam: ఓటీటీలో సంక్రాంతి.. షాక్‌లో అభిమానులు

ABN , Publish Date - Mar 01 , 2025 | 08:58 PM

సంక్రాంతి (Sankranthiki vastunnam) బరిలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ (OTT Streaming) అవుతోంది



సంక్రాంతి (Sankranthiki vastunnam) బరిలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ (OTT Streaming) అవుతోంది. ఇటు  టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ (television premiere) ప్రసారమవుతోంది. కానీ సినిమా నిడివి విషయంలో మాత్రం పెద్ద షాక్‌ ఇచ్చింది. థియేటర్‌లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా, ఓటీటీలో ఆ సమయం తగ్గిపోయింది. జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను స్ట్రీమ్  చేశారు. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.థియేటర్‌ వెర్షన్‌లో నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్‌ రావిపూడి తొలగించారని, అవి ఓటీటీలో యాడ్‌ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! 

ముఖ్యంగా సినిమా ఫ్ల్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. ఎక్స్‌ట్రా సీన్స్‌ యాడ్‌ చేయడం పక్కనపెడితే ఉన్న సన్నివేశాలనే కట్‌ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకూ థియేటర్‌లో అలరించిన పలు చిత్రాలన్నీ ఓటీటీలో అదనపు నిడివితో వచ్చాయి. సంక్రాంతికి థియేటర్‌లో వినోదాల విందును పంచిన ఈ మూవీ మాత్రం తగ్గిన నిడివితో రావడం అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తోంది. దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలకు కత్తెర వేశారు. దీనిపై టీమ్‌ అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి.  

Updated Date - Mar 01 , 2025 | 08:59 PM