Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:45 PM
సినీ అభిమానుల దిల్ ఖుషి చేసే వార్త ఒకటి ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్‌ని గెలుచుకున్న వెంకీ & ఫ్యామిలీ అతి త్వరలోనే మీ ఇంట్లో సందడి చేయనున్నారు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. రేసులో ఉన్న ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలను సైతం బీట్ చేసి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. పొంగల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రెండు వారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఎవరు ఊహించని అప్డేట్ ఒకటి ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రైట్స్ ని భారీ ధరకు ఓ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మహాశివరాత్రికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ ఓటీటీ సంస్థ ఎదో కాదు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న జీ 5(Zee 5). ఎవరు ఊహించనంత తొందరగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ రావడంతో అభిమానులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. అమెరికాలో ఓ బడా కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న వ్యక్తి సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్). అతనితో సొంత రాష్ట్రంలో నాలుగైదు మంచి కంపెనీలు పెట్టించి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్ వీకే) తనని హైదరాబాద్‌కు తీసుకువస్తాడు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పగిస్తారు. అయితే సత్య నగరానికి రాగనే పాండే గ్యాంగ్ అతన్ని అపహరిస్తారు. ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని ఓ రహస్య ఆపరేషన్ చేపడతారు. అతన్ని కాపాడేందుకు సీఎం సపోర్ట్‌తో సస్పెన్షన్‌లో ఉన్న వై.డి.రాజు అలియాస్ చిన్నరాజు (వెంకటేష్)ను రంగంలోకి దించడానికి మీనాక్షి (మీనాక్షి చౌదరి) రాజమండ్రి వస్తుంది. చక్కని భార్య భాగ్యం(ఐశ్వర్యారాజేశ్), నలుగురు పిల్లలతో సరదాగా జీవితాన్ని సాగిస్తున్న చిన్న రాజు సకుటుంబ సమేతంగా ఆకెళ్లను కాపాడటానికి సిద్ధమవుతాడు. ఆ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేమిటి? మీనాక్షికి, వై.డి.రాజుకు ఉన్న సంబంధం ఏంటి? ఈ మిషన్‌ను ఎలా అధిగమించారు అన్నది కథ.