Sammelanam: ఓటీటీలో స్నేహం, ప్రేమల 'సమ్మేళనం'
ABN , Publish Date - Feb 21 , 2025 | 12:36 PM
ఆ కాలేజీ రోజుల నాటి పుస్తకం వీరందరినీ మళ్లీ ఒక్కటి చేస్తుందా? తెలుసుకోవాలంటే సమ్మేళనం’ వెబ్ సిరీస్‌పై లుక్ వేయాల్సిందే.
కాలేజీ రోజుల నాటి స్నేహితుల ముచ్చట్లు, ప్రేమ తాలూకు జ్ఞాపకాలను పోగుచేసి ఓ పుస్తకంలో రాసుకున్నాడు ఓ యువకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్నేహితులంతా దూరమవుతారు. ఇలాంటి సమయంలో ఆ కాలేజీ రోజుల నాటి పుస్తకం వీరందరినీ మళ్లీ ఒక్కటి చేస్తుందా? తెలుసుకోవాలంటే సమ్మేళనం’ (Sammelanam) వెబ్ సిరీస్‌పై లుక్ వేయాల్సిందే. గానాదిత్య, విఘ్నయ్ అభిషేక్, ప్రియా వడ్లమాని(Priya Vadlamani), బిందు ప్రధాన పాత్రల్లో తరుణ్ మహదేవ్ (Tharun Mahadev) దర్శకత్వం వహించారు. సునయానీ, సాకేత్ సంయుక్తంగా నిర్మించారు.
సమ్మేళనం అనే పుస్తకం ఆధారంగా ట్రయాంగీల్ లవ్‌స్టోరీగా ఈ సిరీస్ రూపొందింది. ఈ నెల 20 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. స్నేహం, ప్రేమ, ఆ బంధంలో ఉండే చోటు చేసుకునే గందరగోళాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించిన ఈ సిరీస్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. పలు సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉన్నాయని, ఆడియన్స్‌ని కథలో లీనం చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమకథను, స్నేహితుల మధ్య బంధాన్ని భావోద్వేగంగా చూపించారని చెబుతున్నారు. (Sammelanam On ETV Win)