Razakar OTT Release: ఊచకోత సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది

ABN , Publish Date - Jan 24 , 2025 | 07:27 PM

సినిమాలను డబ్బు కోసం, ఎంటర్ టైన్‌మెంట్ కోసం చేస్తుంటారు. కానీ ‘రజాకార్’ సినిమాను ఒక బాధ్యతతో చేశాం.. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం. రేపటి తరాలు రజాకార్ల అకృత్యాలను తెలుసుకోవాలి. మరోసారి అలాంటి వారు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి చేసిన ప్రయత్నం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Razakar Movie Still

ఖాసిం రజ్వీ స్థాపించిన రజాకార్ సైన్యం ప్రజలపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడింది, దానికి ప్రజలు ఎలా ఎదురుతిరిగారు? అప్పటి భారత ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే నేపథ్యంలో వచ్చిన సినిమా ‘రజాకార్’. థియేటర్లలో ఈ సినిమా చాలా మంచి స్పందనను రాబట్టుకుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీకి వస్తుందా? అని ఎంతో మంది ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. అలా వేచి చూసే వారి కోసం చిత్రయూనిట్ ‘రజాకార్’ని ఓటీటీలోకి తెచ్చేసింది. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, అనసూయ వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 24వ తేదీ నుండి ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఏ ఓటీటీ అనుకుంటున్నారా?


Also Read- Hathya Review : వివేకా మర్దర్‌ ఇతివృత్తంతో రూపొందిన హత్య సినిమా ఎలా ఉందంటే..

మన చరిత్రను తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాలంటే ఆహా కరెక్ట్ ప్లాట్ ఫామ్ అని భావించి ఈ నెల 24న ఈ సినిమాను ప్రీమియర్‌కు తీసుకొస్తున్నామని రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. ఆయన చెప్పినట్లుగా ఈ సినిమా ‘ఆహా’ తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆల్రెడీ ఆహాలో ఈ సినిమా టాప్‌లో దూసుకెళుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు.


ఈ సినిమా కథ విషయానికి వస్తే..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ హైదరాబాద్ మాత్రం నిజాంకు చెందిన ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్ పాండే) పరిపాలనలో వుంది. భారత ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా దేశంలోని సంస్థానాలను, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ హైదరాబాద్ రాజు నిజాం మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అనుకుంటాడు. ఖాసిం రజ్వీ (రాజ్ అర్జున్) అతని ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్ సైన్యంతో, అప్పటి నిజాం ప్రధాని లాయక్ అలీ ఖాన్ (జాన్ విజయ్) తో హైదరాబాద్‌ను పాకిస్తాన్ దేశం సహాయంతో తుర్కిస్తాన్‌గా మార్చడానికి కుట్ర చేస్తాడు. అందుకు తమ రాజ్యంలోని హిందూ ప్రజలని హింసించి, వారిపై దాడులు చేస్తూ, వాళ్ళని మతం మార్చుకోవాలని ఒత్తిడి తెస్తాడు. తెలుగు, కన్నడ, మరాఠీ లాంటి అనేక భాషలను నిషేధించి కేవలం ఉర్దూ మాత్రమే ఉండాలని చట్టం తెస్తాడు.

IndianClicks_Razakar_AJ_1012x530_01232025_1.jpg

తమకి ఇష్టమొచ్చిన రీతిలో ప్రజలపై పన్నులు విధిస్తూ, ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ సైన్యం ఒక మారణహోమాన్ని సృష్టిస్తుంది. వారికి ఎదురు తిరిగిన గ్రామాలను శ్మశానవాటికలా తయారు చేస్తారు. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజ్ సప్రూ) నిజాం పాలన చేస్తున్న మారణ కృత్యాలను తెలుసుకొని సైనిక చర్యకి పూనుకోవాలని అనుకుంటారు. నిజాం పాకిస్తాన్ సహాయం కోరి, భారత సైన్యం రాకుండా తెలంగాణ ప్రాంత సరిహద్దులన్నింటినీ మూసివేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో భారత సైన్యం ఏవిధంగా హైదరాబాద్ చేరుకుంది, ఎలా నిజాం పాలనకి చరమగీతం పాడింది? తెలంగాణ ప్రజలు ఎటువంటి పోరాటం చేశారు? ఇవన్నీ కళ్లకు కట్టినట్లుగా చూపించే చిత్రమే ‘రజాకార్’.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 07:27 PM