Pothugadda Actor: కొన్ని కారణాల వల్ల జుట్టు తీసేశా.. అవకాశం పోయిందని అనుకున్నా కానీ..

ABN , Publish Date - Feb 04 , 2025 | 10:42 PM

24 సినిమా స్ట్రీట్ బ్యానర్‌పై రక్ష వీరమ్ దర్శకత్వంలో అనుపమ చంద్ర కోడూరి, డా.జి. శరత్ చంద్రా రెడ్డి నిర్మించిన చిత్రం ‘పోతుగడ్డ’. ఈ సినిమా తాజాగా ఈటీవీ విన్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సినిమాలో వెంకట్‌ పాత్రపై చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి దర్శకుడు ప్రశంసలు కురిపించడం సంతోషంగా ఉందని అన్నారు ఆ పాత్రలో నటించిన నటుడు. విషయంలోకి వస్తే..

Prashanth Karthi

పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తి, శత్రు, ఆడుకాలం నరేన్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘పోతుగడ్డ’. 24 సినిమా స్ట్రీట్ బ్యానర్‌పై రక్ష వీరమ్ దర్శకత్వంలో అనుపమ చంద్ర కోడూరి, డా.జి. శరత్ చంద్రా రెడ్డి నిర్మించారు. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేసిన ఈ చిత్రం ఇటీవలే ఈటీవీ విన్‌లో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఇందులో వెంకట్ అనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ప్రశాంత్ కార్తి తన పాత్రకు వస్తోన్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..


Also Read- Thandel Ticket Price: ‘తండేల్’‌కు ఏపీలో టికెట్ల ధర పెంపు.. ఎంతంటే?

‘‘నాకు ఈ ‘పోతుగడ్డ’ అవకాశం కెమెరామెన్ రాహుల్ ద్వారా వచ్చింది. ఫస్ట్ ఈ సినిమా కోసం గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కావాలని అన్నారు. ఆ లుక్ కోసం ట్రై చేశాం. అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను జుట్టు తీసేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఆఫర్ పోయినట్టే అని అనుకుంటున్న టైమ్‌లో డైరెక్టర్ రక్ష నుంచి కాల్ వచ్చింది. నా ఒరిజినల్ లుక్‌ని చూసి బాగుంది.. ఇదే ఫైనల్ చేద్దామని అన్నారు. అలా నా లుక్ ఇందులో చాలా నేచురల్‌గా కనిపిస్తుంది. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా ఆరంభం, ముగింపులో నా పాత్రలోని షేడ్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి వెంటనే ఓకే చెప్పాను. ప్రేక్షకులు నా పాత్రను గుర్తు పెట్టుకుని మరీ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాలో అన్ని పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నా పాత్రలోని వేరియేషన్, యాక్టింగ్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్ర సిద్దార్థ, చంద్రశేఖర్ యేలేటి వంటి వారు ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేను.


Also Read- Jr NTR: అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్..

ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా నైట్ టైంలోనే జరిగింది. అది కూడా పూర్తి చలికాలంలోనే షూటింగ్ చేశాం. అంతటి చలిలోనూ మా టీమ్‌కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా నిర్మాత అనుపమ, మా దర్శకులు రక్ష గార్లు ఎంతో చక్కగా చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే టీమ్ అంతా ఓ ఫ్యామిలీలా కలిసి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా నిర్మాత ఎంతో ప్లాన్‌గా షూటింగ్ చేయించారు.


Also Read- Aaradhya Bachchan: ఆ కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ల కుమార్తె..

‘పోతుగడ్డ’ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాలు ఉంటాయి. రాజకీయం చుట్టూ కథ తిరిగినా కూడా.. ఓ అందమైన ప్రేమ కథను ఇందులో చూపించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా అందరూ ఎంటర్‌టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా తర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీలో అవకాశం వచ్చింది. ఆ సినిమా వివరాలను త్వరలోనే ప్రకటిస్తాను. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి..’’ అని ప్రశాంత్ కార్తి చెప్పుకొచ్చారు.


Also Read- Nagarjuna: నిరాశలో అక్కినేని అభిమానులు

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

Also Read- Heroine Rakshita: గుర్తుపట్టలేని స్థితిలో పూరి హీరోయిన్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 10:42 PM