Bollywood Actress: పరిణీతీ చోప్రా మొదలెట్టేసింది...

ABN , Publish Date - Feb 28 , 2025 | 10:29 AM

ఇంతవరకూ వెండితెరకే పరిమితమైన బాలీవుడ్ భామ పరిణీతీ చోప్రా త్వరలో ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది. ఆమె నటిస్తున్న ఫస్ట్ వెబ్ సీరిస్ షూటింగ్ ప్రస్తుతం సిమ్లాలో జరుగుతోంది.

అందంతో పాటు అభినయంలోనూ తన సత్తా చాటుతుంటుంది బాలీవుడ్ హీరోయిన్ పరిణీతీ చోప్రా (Parineeti Chopra) . ఇంతకాలం వెండితెరకే పరిమితం అయిన ఈ భామ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్థమైంది. హిందీలో ఓ సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ వెబ్ సీరిస్ కు అమ్మడు పచ్చజెండా ఊపేసింది. అంతేకాదు... ఇప్పుడు షూటింగ్ లో కూడా జాయిన్ అయిపోయింది. ఆమె నటిస్తున్న ఈ వెబ్ సీరిస్ షూటింగ్ ప్రస్తుతం సిమ్లాలో జరుగుతోంది. పరిణీతీ చోప్రాతో పాటు ఇందులో తాహిర్ రాజ్ బాసిన్, అనూప్ సోనీ, జెన్ని ఫర్ వింగెట్, చైతన్య చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


'అక్స్ (Aks), రంగ్ దే బసంతి (Rang De Basanti), స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (Student of the Year)' చిత్రాలకు రచన చేసిన రెన్సిల్ డిసిల్వా ఈ వెబ్ సీరిస్ కు దర్శకుడు. ఈయన ఇంతకుముందు 'ఖుర్బాన్, ఉంగ్లీ' చిత్రాలను రూపొందించాడు. ఈ వెబ్ సీరిస్ ను సిద్ధార్థ్‌ పి మల్హోత్రా, సప్నా మల్హోత్రా నిర్మిస్తున్నారు. తొలి వెబ్ సీరిస్ చిత్రీకరణలో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ పరిణీతీ చోప్రా సోషల్ మీడియా ద్వారా తన హర్షాన్ని వ్యక్తం చేసింది.

Also Read: Crypto Currency: కాజల్, తమన్నాకు కష్టాలు!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 10:30 AM