Officer On Duty: ఆరు రోజుల్లోనే ఓటీటీలో ఆఫీసర్...

ABN , Publish Date - Mar 19 , 2025 | 02:09 PM

కుంచాకో బోబన్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ వచ్చిన ఆరు రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఏదైనా ఒక భాషలో విడుదలై విజయం సాధించిన సినిమా మరో భాషలోకి డబ్బింగ్ అవడానికి రెండు, మూడు వారాలు పడుతోంది. అయితే... మాతృక రిలీజ్ అయిన దగ్గర నుండి మూడు, నాలుగు వారాల్లో సినిమా ఓటీటీ (OTT) లో ప్రత్యక్షమౌతోంది. ఇటీవల ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు ఓటీటీ సంస్థలు ఇతర ప్రధాన నాలుగు భాషల్లోనూ డబ్బింగ్ చేసి మూవీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. దాంతో డబ్బింగ్ వర్షన్ జనం ముందు వచ్చిన ఒకటి రెండు వారాల్లోనే ఆ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమౌతోంది.


తాజాగా ఇది మలయాళ చిత్రం 'ఆఫీసర్' విషయంలో జరిగింది. కుంచాకో బోబర్, ప్రియమణి (Priyamani) కీలక పాత్రలు పోషించిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' (Officer On Duty) మూవీ మలయాళంలో ఫిబ్రవరి 20న విడుదలైంది. అక్కడ మంచి టాక్ రావడంతో తెలుగులో దీనిని డబ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా మార్చి 7న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మార్చి 14వ తేదీ ఈ సినిమా తెలుగు వర్షన్ విడుదలైంది. అయితే... ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇది మార్చి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అంటే తెలుగు వర్షన్ విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలో వచ్చేస్తోందన్నమాట. ఇలా వారానికే సినిమా ఓటీటీలో వస్తున్నప్పుడు ఇంకా థియేటర్లకు వెళ్ళి జనాలు ఎందుకు చూస్తారు? 'ఆఫీసర్' అనే కాదు.... చాలా అనువాద చిత్రాలకు థియేట్రికల్ కలెక్షన్స్ రాకుండా ఓటీటీ సంస్థలు దెబ్బకొడుతున్నాయి. ఒకేసారి అన్ని భాషల్లో విడుదలైతే ఫర్వాలేదు కానీ... వారం, రెండు వారాల తర్వాత డబ్ అయితే మాత్రం డబ్బింగ్ చిత్రాల నిర్మాతలకు దెబ్బే!

Also Read: Rakesh Varre: ఎట్టకేలకు ఓటీటీలో జితేందర్ రెడ్డి చిత్రం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 19 , 2025 | 02:10 PM