Trolling on Agent: రామచంద్ర ప్రభో.. ఏజెంట్‌ను ఆడుకుంటున్నారు.

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:04 PM

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన చిత్రం ఏజెంట్‌. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్‌లో విడుదలైంది. అఖిల్‌ కెరీర్‌లో పెద్ద ఫ్లాప్‌ సినిమా ఇది.


అక్కినేని అఖిల్‌ (Akkineni AKhil) హీరోగా నటించిన చిత్రం ఏజెంట్‌ (Agent). సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్‌లో విడుదలైంది. అఖిల్‌ కెరీర్‌లో పెద్ద ఫ్లాప్‌ సినిమా ఇది. ఈ సినిమా తర్వాత దర్శకుడు, హీరో నుంచి మరో చిత్రం రాలేదు. అయితే రెండేళ్ల తరవాత ఏజెంట్‌ ఓటీటీలో విడుదలైంది. అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయిందో తెలుసుకోవడానికి నెటిజన్లు ఈ చిత్రం ఓటీటీలోకి రావాలని కోరుకున్నారు. వచ్చాక ఊరికే ఉంటారా? మళ్లీ ట్రోలింగ్‌  మొదలు పెట్టారు. ‘ఏజెంట్‌’ సినిమాల్లోని ఆణిముత్యాల్లాంటి సీన్లు, డైలాగులు, ఎక్స్‌ప్రెషన్లూ.. (Trolling on Agent movie) అన్నీ ఏరి కోరి సోషల్‌ మీడియాలో పార్టు పార్టులుగా పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. లాజిక్‌ లేని సీన్లు, అమీర్‌ పేట్‌ క్వాలిటీతో దింపిన వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌.. ఈ సినిమా డిజాస్టర్‌ అవ్వడం తప్పులేదు. అందుకు ఈ సినిమాకు అర్హత ఉంది’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ALSO READ: Anasuya Bharadwaj: దమ్ముంటే దగ్గరకు రారా.. ఏ ప్యాంట్‌ తడిచిందా..



ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా నెల రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిస్తుంది. కానీ ఏజెంట్‌ స్ట్రీమింగ్‌ కావడానికి రెండేళ్లు పట్టింది. ఓటీటీ సంస్థకూ, నిర్మాతకూ మధ్య కొన్ని సెటిల్‌మెంట్‌ కాని విషయాలు ఇబ్బంది పెట్టాయి. అన్ని సమస్యలు తొలగి ఈ మధ్యనే సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టిన రోజే కొత్త సినిమా షూటింగ్‌ మొదలు పెట్టాడు. సురేందర్‌ రెడ్డి కూడా కొత్త సినిమా పనుల్లో ఉన్నారు. ఇద్దరికీ ఈ సినిమా వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు. 

ALSO READ: Nagarjuna: నాగార్జున వందవ చిత్రానికి కసరత్తులు..

Sree Vishnu: ఐటెమ్‌ ఫిక్స్‌ అయినట్టేనా..



Updated Date - Mar 16 , 2025 | 05:12 PM