Netflix 2025 Movies: బ్లాక్‌బస్టర్ బొనాంజా.. 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే బిగ్ స్టార్స్, ఎపిక్ తెలుగు సినిమాలివే..
ABN , Publish Date - Jan 14 , 2025 | 10:43 PM
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 2025లో వచ్చే సినిమా లిస్ట్‌ని ప్రకటించింది. థియేట్రికల్ రన్ అనంతరం చేసుకున్న ఒప్పందం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే బిగ్ స్టార్, ఎపిక్ సినిమాల లిస్ట్‌ని మకర సంక్రాంతి స్పెషల్‌గా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2025లో నెట్‌ఫ్లిక్ష్‌లో వచ్చే సినిమాలేంటంటే..
మకర సంక్రాంతి సందర్భంగా, 2025లో తెలుగులో విడుదల చేయనున్న బిగ్ స్టార్స్, ఎపిక్ సినిమాలని అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. 2024లో ‘దేవర పార్ట్ 1, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సలార్, సరిపోదా శనివారం’తో పాటు అనేక పాపులర్ చిత్రాలతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ, తన అప్ కమింగ్ తెలుగు చిత్రాలను ప్రకటించి వీక్షకులను బ్లాక్‌బస్టర్ బొనాంజా మూడ్‌లోకి తీసుకెళ్లింది. ఇవి 2025లో థియేటర్లలో విడుదలైన తర్వాత చేసుకున్న ఒప్పందం ప్రకారం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు పరిశ్రమలోని కొంతమంది అత్యుత్తమ నటుల, కథలు, పెర్ఫార్మెన్స్‌లతో ఈ చిత్రాలు తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తీసుకువస్తాయని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన చిత్రాలలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు మాస్ మహారాజా రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య వంటి క్రేజీ హీరోల చిత్రాలు ఉన్నాయి. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. 2024 నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు అద్భుతమైన సంవత్సరం. ఎందుకంటే, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తెలుగు సినిమాలు హృదయాలను గెలుచుకున్నాయి. ‘దేవర, గుంటూరు కారం, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్, సలార్, సరిపోదా శనివారం’ వంటి బ్లాక్‌బస్టర్‌లు ప్రపంచవ్యాప్తంగా లవబుల్‌గా మారి.. వాచ్‌లిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇప్పుడు 2025లోకి అడుగుపెట్టేశాం.. ఇంకాస్త ఉత్సాహం నింపేలా.. పరిశ్రమలోని ప్రముఖ నటులు, కథలతో కూడిన స్లేట్‌తో, ఎదురుచూడటానికి చాలా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG, హిట్ 3 - ది థర్డ్ కేస్ నుండి యాక్షన్-ప్యాక్డ్ VD 12 వరకు, ఈ సంవత్సరం మరపురాని కథలు, భావోద్వేగాలు, అద్భుతమైన ప్రదర్శనలను హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన 2025లో వచ్చే సినిమాలివే..
OG
క్యాస్టింగ్: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ
అనగనగా ఒక రాజు
క్యాస్టింగ్: నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
Court: State vs A Nobody
క్యాస్టింగ్: ప్రియదర్శి, శివాజీ
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
జాక్
క్యాస్టింగ్: సిద్ధు జొన్నలగడ్డ
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
మ్యాడ్ స్క్వేర్
క్యాస్టింగ్: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
మాస్ జాతర
క్యాస్టింగ్: రవితేజ
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
తండేల్
క్యాస్టింగ్: నాగ చైతన్య, సాయి పల్లవి
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
విజయ్ దేవరకొండ 12 (VD12)
క్యాస్టింగ్: విజయ్ దేవరకొండ
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
Hit 3 - The Third Case
క్యాస్టింగ్: నాని
లాంగ్వేజ్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ