Netflix OTT: ఈ రెండు వెబ్ సిరీస్‌లపైనే.. అందరి చూపు!
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:01 PM
నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా ఓ భారీ వేడుకను నిర్వహించి.. ఈ ఏడాది విడుదలయ్యే వెబ్ సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. అందులో చాలా వెబ్ సిరీస్‌లు ఉన్నా.. రెండు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ రెండింటి కోసం నెట్‌ఫ్లిక్స్ వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాటి విషయానికి వస్తే..
నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా ఈ సంవత్సరం వచ్చే వెబ్ సిరీస్‌ల వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని ఓ భారీ వేడుకపై నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్, డ్రామా ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా వీక్షకులను సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది సరికొత్త కంటెంట్‌ను వీక్షకులకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చే రెండు వెబ్ సిరీస్‌లపై ఇప్పుడందరి చూపు ఉంది. అవే ‘రానా నాయుడు’, ‘టెస్ట్’. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read-Allu Aravind: రామ్ చరణ్ ‘చిరుత’పై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్
మాధవన్, సిద్దార్థ్, నయనతార, మీరా జాస్మిన్ వంటి భారీ తారాగణంతో ఎస్. శశికాంత్ ‘టెస్ట్’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఏ వైనాట్ స్టూడియో బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ ‘టెస్ట్’ వెబ్ సిరీస్ ‘జీవితమే ఓ ఆట’ అనే కాన్సెప్ట్‌తో రాబోతోంది. భిన్న మనస్తత్వాలు, భిన్న దారుల్ని ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని.. లవ్, అంతులేని కలలు, లక్ష్యాలు, కోరికలు, క్రికెట్ వంటి ఎమోషన్స్ ఇందులో ఉంటాయని సిరీస్ టీమ్ తెలిపింది. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ వీక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ తెలిపారు.
ఇక రెండోది ‘రానా నాయుడు’. మొదటి సీజన్ ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడంతో పాటు పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయినా కూడా సీజన్ 2పై బీభత్సమైన హైప్‌ని ఈ సిరీస్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం సీజన్-2 రెడీ అయినట్లుగా ఈ వేడుకలో చెప్పుకొచ్చారు. ఈ రెండో సీజన్‌లో రానా నాయుడికి ఎదురైన కొత్త సమస్య ఏంటి? తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు రానా నాయుడు ఏం చేశారు? గతంలో చేసిన పనుల వల్ల ఏర్పడిన ఈ కొత్త సమస్యలు ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సీజన్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా లోగో మోటివ్ గ్లోబల్ మీడియా నిర్మాత సుందర్ అరోన్ మాట్లాడుతూ.. ‘రానా నాయుడు రెండో సీజన్‌ను అందరి ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ రెండో సీజన్ పనులు ప్రారంభించాం. ఈ రెండో సీజన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, పెట్టిన బడ్జెట్ చూసి ఆడియెన్స్ ఫిదా అవుతారు. నెట్ ఫ్లిక్స్ సహకారంతో ఈ రెండో సీజన్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ఈ రెండో సీజన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎదురు చూపులకు తగ్గ ప్రతిఫలం దక్కిందని ఈ సీజన్ చూసిన వారంతా చెబుతారు’ అని పేర్కొన్నారు.