Test -Ott: నయనతార టెస్ట్.. ఓటీటీలో ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:16 PM
‘మనందరి జీవితాల్లో ఒక మలుపు కచ్చితంగా ఉంటుంది. అదే జీవితంలో అసలైన ‘టెస్ట్’’ అంటూ టెస్ట్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్
చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందింది ‘టెస్ట్’ (Test Movie). ఎస్.శశికాంత్ దర్శకత్వంలో (S Sashikanth) ఈ సినిమా రూపొందింది. ఇప్పుడీ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకు సిద్థమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ షేర్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ (OTT streaming) కానున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. ‘మనందరి జీవితాల్లో ఒక మలుపు కచ్చితంగా ఉంటుంది. అదే జీవితంలో అసలైన ‘టెస్ట్’’ అని క్యాప్షన్ పెట్టింది.
ఇందులో కుముధ పాత్రలో నయనతార, క్రికెటర్ అర్జున్‌గా సిద్థార్థ్ (Siddarth) కనిపించగా ఆర్.మాధవన్(R Madhavan), మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంతో శశికాంత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మీరా జాస్మిన్ తమిళ సినిమాలో కనిపించనున్నారు. అలాగే రెండు దశాబాల తర్వాత ఆమె మాధవన్‌తో కలిసి నటించడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్‌తో రచయితగా గుర్తింపుతెచ్చుకున్న సుమన్ కుమార్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి శక్తిశ్రీ గోపాలన్ సంగీతం అందించారు.
ALSO READ: Tamannaah-Vijay varma: విడిపోవాలనుకోవడానికి కారణం ఏంటి.. కెరీర్ అడ్డం పడుతోందా..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి