Vidaamuyarchi: అయ్యయ్యో.. అజిత్ పరిస్థితి ఇలా అయ్యిందేమిటీ!?

ABN , Publish Date - Feb 25 , 2025 | 01:46 PM

అజిత్ తాజా చిత్రం 'విడా ముయార్చి' బాక్సాఫీస్ బరిలో తన సత్తా చాటలేకపోయింది. దాంతో ఈ సినిమాను నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) సినిమాలు కొంత కాలంగా బాక్సాఫీస్ బరిలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. తాజా చిత్రం 'విడా ముయార్చి' (Vidaamuyarchi) దీ అదే అయ్యింది. ఈ సినిమాను తెలుగులో 'పట్టుదల' (Pattudala) పేరుతో అనువదించి, ఫిబ్రవరి 6వ తేదీనే విడుదల చేశారు. త్రిషా (Trisha), అర్జున్ సర్జా (Arjun Sarja), రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. యాక్షన్ ప్యాక్డ్ గా తెరకెక్కిన 'విడా ముయార్చి'ని ప్రేక్షకులు తిరస్కరించారు. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఖాతాలో మరో ఫ్లాప్ మూవీ జమ అయ్యింది.


ajith.png

ఇదిలా ఉంటే... ఇప్పుడు 'విడా ముయార్చి' ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. మార్చి 3వ తేదీని ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. చిత్రం ఏమంటే... ఈ సినిమా అప్పటికి విడుదలై నెల రోజుల కూడా పూర్తి కాదు. అంటే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి నెలలోనే ఓటీటీలో ప్రత్యక్షమౌతోందన్న మాట. ఇదే పరిస్థితి కొనసాగితే... కాస్తంత ఓపిక పడితే... తమ ఫేవరెట్ హీరో సినిమాను హ్యాపీగా ఓటీటీలో చూసేయొచ్చని జనాలు థియేటర్లకు వెళ్ళడమే మానేస్తారు. పైగా ఈ ప్రభావం అజిత్ రాబోయే సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) మీద కూడా పడే ఛాన్స్ ఉంది.

Updated Date - Feb 25 , 2025 | 01:47 PM