Sinners OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి.. హాలీవుడ్ లేటెస్ట్ బోల్డ్‌, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌! ఎందులో చూడాలంటే

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:48 PM

ఏప్రిల్‌లో ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి అంచ‌నాల‌ను మించి సంచ‌ల‌న విజ‌యం సాధించిన హాలీవుడ్ చిత్రం సిన్న‌ర్స్ ఓటీటీకి వ‌చ్చేసింది.

sinners

ఏప్రిల్‌లో ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి అంచ‌నాల‌ను మించి సంచ‌ల‌న విజ‌యం సాధించిన హాలీవుడ్ చిత్రం సిన్న‌ర్స్ (Sinners). మైఖేల్ బి. జోర్డాన్ (Michael B. Jordan) హీరోగా డ్యుయ‌ల్ రోల్ చేయ‌గా హైలీ స్టెయిన్‌ఫెల్డ్, మైల్స్ కాటన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని క్రీడ్‌, బ్లాక్ పాంత‌ర్ వంటి భారీ సినిమాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న ర్యాన్ కూగ్లర్ (Ryan Coogler) ఈ సినిమాను నిర్మించ‌డంతో పాటు స్వ‌యంగా ర‌చించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. దాదాపు 90 మిల‌య‌న్ డాల‌ర‌ల్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం దానికి మూడింత‌లు 351 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసి హాలీవుడ్‌లో 2025 హ‌య్యేస్ట్ గ్రాస‌ర్ చిత్రాల్లో టాప్ టెన్‌లో నిలవ‌డం విశేషం. అయితే ఇప్పుడీ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

GsfyUuJb0AEg6-z.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1932లో జ‌రిగే స్టోరీగా ఈ సినిమా న‌డుస్తుంది. నేర‌స్తులైన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు స్మోక్ , స్టాక్ గ్యాంగ్‌స్ట‌ర్ల నుంచి డ‌బ్బు దొంగిలించి చికాగో నుంచి దూరంగా మిస్సిస్సిప్పి డెల్టా అనే ప్రాంతానికి వ‌చ్చి అక్క‌డ ఉన్న త‌మ క‌మ్యూనిటీ ప్ర‌జ‌ల కోసం ఓ ప‌బ్ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఇందులో పిన చేయ‌డం కోసం త‌మ పాత మిత్రుల‌ను, విడిపోయిన స్మోక్‌ భార్య‌ను అక్క‌డికి తీసుకు వ‌స్తారు. అయితే ప‌బ్ ప్రారంభించాక ప‌బ్లిక్ చాలా మంది వ‌చ్చి ఎంజాయ్ చేస్తుండ‌గా ఓ ర‌క్త పిశాచి (వ్యాంపైర్‌) వేషం మార్చుకుని అక్క‌డి వారిపై దాడి చేయ‌గా దాడికి గురైన వారు వెంట‌నే పిశాచుల్లాగా మారిపోతుంటారు.

Gsca4ZDWEAAo3gX.jpeg

ఈ నేప‌థ్యంలో పార్టీలో ఉన్న వారు త‌ప్పించుకున్నారా లేదా, చివ‌ర‌కు ఎంత మంది, మిగిలారు, ఆ పిశాచాల‌ను ఎలా అంత‌మొందించారు, ఇంత‌కు పిశాచాలు అక్క‌డికే ఎందుకు వ‌చ్చాయి, దాని స్టోరీ ఎంట‌నే ఆస‌క్తికర పాయింట్‌తో సినిమా ఆద్యంతం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. అయితే చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్టును అర్ధం చేసుకోవ‌డానికి మ‌న బుర్ర‌కు చాలా ప‌దును పెట్టాల్సి వ‌స్తుంది. అయితే ఈ సినిమా కమొద‌టి భాగంలో చాలా సేపు క్యారెక్ట‌ర్ల డెవ‌ల‌ప్మెంట్ కోసం ఎక్కువ స‌మ‌యం వెచ్చించిన ద‌ర్శ‌కుడు క‌థ‌లోకి వెళ్ల‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు. ఇక ఒక్క‌సారి క‌థ‌లోకి వెళ్లాక ఎక్క‌డా బ్రేకుల్లేకుండా ఒక దాని వెంట మ‌రోటి ఇంట్రెస్టింగ్ స‌న్నివేశాలు ర‌న్ అవుతూ చూసే ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే థ్రిల్‌ను ఇస్తుంది.

GsTYSbAXwAAPNYf.jpeg

కాగా ఈ సినిమాను ఫ్యామిలీతో క‌లిసి ఏ కోశానా చూడ‌లేం. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో శృతి మించిన రొమాంటిక్ సీన్స్ వ‌చ్చి ఇబ్బంది పెడ‌తాయి. ఇక సినిమాకు సంగీతమే హీరో అన్న అతిశ‌యోక్తి కాదు. చాలా సీన్ల‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ స్పీక‌ర్ల దుమ్ము దుల‌ప‌డ‌మే గాక ఆయా స‌న్నివేశాల టైంలో ఫుల్ హై ఇస్తుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), బుక్ మై షో స్ట్రీం (BookMyShow Stream) ఓటీటీల్లో రెంట్ ప‌ద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని ఫ్రీ మూవీ వెబ్‌సైట్ల‌లోనూ అందుబాటులో ఉంది. హాలీవుడ్ ముఖ్యంగా హ‌ర్ర్ జాన‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు ఈ సిన్న‌ర్స్ (Sinners) సినిమా చూసేయ‌వ‌చ్చు కానీ.. పిల్ల‌ల‌ను మాత్రం దూరం ఉంచ‌డం చాలా ఉత్త‌మం.

Updated Date - Jun 03 , 2025 | 12:48 PM