OTT: కాంట్రవర్షియల్ తమిళ చిత్రం ఓటీటీలో!
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:35 PM
ఫిబ్రవరి 14న విడుదలైన 'కాదల్ ఎన్నబదు పొదువుడమై' అనే తమిళ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. లెస్బియనిజాన్ని తెరపై చూపించిన ఇలాంటి సినిమాను నిషేధించాలని కొందరు కోరినా, సెన్సార్ బోర్డ్ దీనికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
వివాదాస్పద చిత్రాలకు ఇప్పుడు ఓటీటీనే వేదికయ్యింది. థియేటర్లలో ఇలాంటి సినిమాలకు సెన్సార్ మోకాలడ్డడంతో కొందరు మేకర్స్ ముందే ఓటీటీని దృష్టిలో పెట్టుకుని నిర్మొహమాటంగా తాము చెప్పాలనుకుంటున్న పాయింట్ ను మూవీగా తీసేస్తున్నారు. ఓటీటీకి ఎలానూ సెన్సార్ అనేది ఉండదు కాబట్టి గొడవే లేదు. అయితే ఇటీవలి కాలంలో ఓటీటీలో మరీ దారుణమైన కంటెంట్ వస్తోందని, దానిని ఏదో ఒక స్థాయిలో కంట్రోల్ చేయాలని, దానికీ సెన్సారింగ్ ఉండాలని కొందరు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే... ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేన ఓ తమిళ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు అదే సరైన తేదీ అని సదరు దర్శక నిర్మాతలు భావించారు. ఇద్దరు యువతుల మధ్య పుట్టిన ప్రేమ ఎలాంటి పరిస్థితికి దారి తీసిందనేది ఆ చిత్ర కథాంశం. 'కాదల్ ఎన్నబదు పొదువుడమై' (kadhal enbathu podhuvudamai)అనే ఈ సినిమాను జనాలు రిజెక్ట్ చేశారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే పదహారేళ్ళు పైబడిన వారిని ఉద్దేశించి తీసిన సినిమా ఇదని పేర్కొన్నారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలనే సినిమాగా తీశామని ఈ చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్టులు వినీత్ (Vineeth), రోహిణి (Rohini) జంటగా నటించారు. లిజోమోల్ జోస్ లెస్బియన్ గా నటించింది. సినిమా రంగానికి చెందిన జ్యోతిక (Jyothika) వంటి వారు ఈ మూవీని ప్రశంసించారు. అప్పుడు జనాల తిరస్కరణకు గురైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. తమిళ వర్షన్ ను మాత్రమే టెంట్ కొట్ట ఓటీటీ యాప్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం 'సూక్ష్మదర్శిని' (Sookshmadarshini) చిత్రం బేసిక్ లైన్ కూడా అదే. లెస్బియన్ గా మారిన కూతురుని హతమార్చిన ఓ కుటుంబ కథ ఇది. తమ కూతురు మరో అమ్మాయితో సన్నిహితంగా మెలగడం, ఇది చాలదన్నట్టుగా ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఓ బాబును దత్తత్తు తీసుకోవడం... దీనిని తట్టుకోలేక అందులో ఓ అమ్మాయి తల్లి, అన్న కలిసి ఆమెను హతమార్చడమే ఆ సినిమా! అయితే... ఈ హత్యను పక్కింటి అమ్మాయి ఎలా వెలుగులోకి తీసుకొచ్చిందనే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అసహజ శృంగారం, లెస్బియనిజం వంటివి ఎలా కుటుంబ సభ్యుల హత్యలకు కారణమౌతున్నాయనే అంశాన్ని అందులో చూపించారు.
Also Read: Sanvi Sudeep: డాడీ ప్లేస్ భర్తీ చేయబోతున్న స్టార్ డాటర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి