Its Complicated: సీన్ రివర్స్: ఓటీటీ తర్వాత థియేటర్స్ కు...
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:07 PM
సహజంగా మన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో విడుదల అవుతుంటాయి, అది కూడా మూడు, నాలుగు వారాల తర్వాత. కానీ చిత్రంగా ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి... ఆపైన థియేటర్లలో సందడి చేసే కల్చర్ మొదలైంది.
సహజంగా మన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో విడుదల అవుతుంటాయి, అది కూడా మూడు, నాలుగు వారాల తర్వాత. కానీ చిత్రంగా ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి... ఆపైన థియేటర్లలో సందడి చేసే కల్చర్ మొదలైంది. ఈ యేడాది జనవరి 3న ‘ఎవోల్‘ (EVOL) మూవీ థియేటర్లలోకి వచ్చింది. నిజానికి ఈ మూవీ గత యేడాది ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. పరమ బూతు చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను థియేటర్లలో జనాలు చూడరని నిర్ణయించుకున్న దర్శక నిర్మాత దానిని అప్పట్లో ఓటీటీలో OTT) పెట్టేశారు. అయితే... ఆశ చావకన్నట్టుగా మొన్న జనవరిలో దీనిని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. బట్ ఫలితం వారు ఊహించినట్టుగానే జరిగింది. జనాలు ‘ఎవోల్‘ (EVOL) మూవీని తిరస్కరించారు.
ఇప్పుడు అదే తరహాలో ఐదేళ్ళ క్రితం ఓటీటీలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల‘ (Krishna and His Leela) మూవీ పేరు మార్చుకుని థియేటర్లలో ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా రాబోతోంది. ఓటీటీకి సెన్సార్ ఉండదు కాబట్టి... అప్పట్లో దర్శక నిర్మాతలు తమకు నచ్చిన రీతిలో ఈ మూవీని తీసేసి వ్యూవర్స్ మీదకు వదిలేశారు. కానీ థియేట్రికల్ రిలీజ్ అనేసరికీ ఆ పప్పులు ఉడకవు. అందుకే సెన్సార్ చేయిస్తే... ముందు వేటు మూవీ టైటిల్ మీద పడింది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల‘ అనే టైటిల్ ను అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమాకు ఇవ్వడానికి వారు ససేమిరా అన్నారు. దాంతో ఈ మూవీ పేరును ‘ఇట్స్ కాంప్లికేటెడ్‘ (It's Complicated) గా మార్చారు. అలానే సెన్సార్ నిబంధనలకు అనుసరించి, అన్నింటికి ఆమోదం తెలిపాక... ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి అనుమతి లభించింది.
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‘ చిత్రాలు ఘన విజయం సాధించడంతో అతను హీరోగా నటించిన ‘ఇట్స్ కాంప్లికేటెడ్‘ను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, ఆహాలో చూసిన... జనాలు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని చిత్ర నిర్మాత రానా (Rana) భావిస్తున్నారు. కాస్త రిస్క్ తీసుకుని రిలీజ్ చేస్తే పెట్టిన ఖర్చులు వెనక్కి వస్తాయని నమ్ముతున్నారు. ఇందులో హీరోయిన్లుగా నటించిన శ్రద్థ శ్రీనాథ్ (Shradhaa Srinath), సీరత్ కపూర్ (Seerat Kapoor) ఇప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాలక్రిష్ణ ‘డాకు మహారాజ్‘ (Daaku Maharaj) లో శ్రద్థ శ్రీనాథ్ కీలక పాత్ర పోషించడమే కాదు... మంచి పేరూ తెచ్చుకుంది. ఇక సీరత్ కపూర్ ఐటమ్ గర్ల్ గా డామినేట్ చేస్తోంది. ఇందులో మరో కీలక పాత్ర పోషించిన షాలిని వడ్నికట్టి మాత్రం ఆ తర్వాత రెండే సినిమాల్లో నటించి, నటనకు దూరమై పోయింది. ఏదేమైనా దర్శక నిర్మాతలు రవికాంత్ పేరెపు, రానా, హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘ఇట్స్ కాంప్లికేటెడ్‘ విజయం పై ధీమా వ్యక్తం చేస్తూ, భారీగానే పబ్లిసిటీ చేస్తున్నారు. మరి వీరి నమ్మకం ఏ మాత్రం నిలబడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే కరోనా సందర్భంగా నాని (Naani), సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన ‘వి‘ సినిమా సైతం అప్పట్లో ముందు ఓటీటీలో విడుదలై... ఆ తర్వాత థియేటర్లలో వచ్చింది.