Huma Qureshi: రాణి భారతి ఈజ్ బ్యాక్..
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:22 PM
ఓటీటీ మాధ్యమాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘మహారాణి’ ఒకటి .
ఓటీటీ మాధ్యమాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘మహారాణి’ ఒకటి . అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ నటి హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘మహారాణి’ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని తెలియజేసే సిరీస్ ఇది. ఈ వ్యవస్థలో ఆమెకు ఎదురైన సవాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్రలు, రాజకీయ వైరుద్ధ్యాలు ఇందులో చూపించారు. గత మూడు సీజన్స్ తరహాలోనే నాలుగో సీజన్ కూడా మరింత గ్రిప్పింగ్ ప్రేక్షకులను మెప్పించనుందని మేకర్స్ చెబుతున్నారు.