Aha: ఓటీటీలో హన్సిక మోత్వానీ గార్డియన్...
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:28 AM
అందాల హన్సిక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి పెడుతోంది. కాన్సెప్ట్ మూవీస్ తో పాటు హారర్ చిత్రాలనూ చేస్తోంది. అలా గత యేడాది జనం ముందుకు వచ్చిన తమిళ చిత్రం 'గార్డియన్' ఇప్పుడు తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సబరి, గురు శరవణన్ దర్శకత్వం వహించిన హన్సిక (Hansika) హారర్ థ్రిల్లర్ 'గార్డియన్' (Guardian). ఈ చిత్రం తమిళ్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆహా (AHA) తమిళ ఓటీటీ ప్లాట్ పార్మ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని భవాని మీడియా ద్వారా ఆహా ప్లాట్‌ఫామ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 2024 మార్చి 8న తమిళంలో విడుదలైన 'గార్డియన్' ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్‌తో, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. (Sam C.S) అందించిన హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కె. ఏ. శక్తివేల్ సినిమాటోగ్రఫీ, అలాగే ఎం. త్యాగరాజన్ ఎడిటింగ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించాయి. అందాల హన్సికలోని మరో యాంగిల్ ను ఆమె అభిమానులు ఈ సినిమాలో చూడొచ్చు.
Also Read: Rohit Setty: కాప్ యూనివర్స్ లో రెండు సీక్వెల్స్
Also Read: Janhvi Kapoor: వెండితెర నుండి వెబ్ సీరిస్ కు....
Also Read: NTR- ANR: నందమూరి - అక్కినేని అనుబంధం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి