Game Changer: ఓటీటీలో గేమ్ ఛేంజర్.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Feb 04 , 2025 | 02:35 PM
దిల్ రాజు (Dil raju) నిర్మాణంలో సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ '‘గేమ్ ఛేంజర్’' ఇప్పుడు ఓటీటీ ద్వారా (OTT release) ఆడియన్స్‌కు అలరించేందుకు సిద్థమైంది.
రామ్ చరణ్ (Ram charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). దిల్ రాజు (Dil raju) నిర్మాణంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా (OTT release) ఆడియన్స్‌కు అలరించేందుకు సిద్థమైంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతోపాటు కియారా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కథ:
రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఓ యువ ఐపీఎస్ అధికారి. కాలేజీలో తను ప్రేమించిన దీపిక (కియారా అడ్వాణీ) కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. విశాఖ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్‌తో యుద్థం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్). పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌ని అధికార బలంతో ఏం చేశాడు? సమర్థుడైన రామ్‌నందన్.. మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు? అప్పన్న (రామ్‌చరణ్), పార్వతి (అంజలి)తో రామ్‌నందన్‌కి ఉన్న సంబంధం ఏంటన్నది ఈ సినిమా