Daaku Maharaaj -Ott: ‘డాకు మహారాజ్‌’  ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..  

ABN , Publish Date - Feb 16 , 2025 | 01:07 PM

నందమూరి బాలకృష్ణ (NBK)హీరోగా బాబీ కొల్లి (Bobby) దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటిటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

నందమూరి బాలకృష్ణ (NBK)హీరోగా బాబీ కొల్లి (Bobby) దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా, బాబీ దేవోల్‌ (bobby deol) కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం  విజయాన్ని అందుకుంది.  ఇప్పుడు ఓటిటీ లో స్ట్రీమింగ్ కు  రెడీ అయింది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix ott) తాజాగా ‘డాకు మహారాజ్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 21 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుందని నెట్ ఫ్లిక్ తెలిపింది. 

Daaku.jpg

కథ:

 చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలో ఈ కథ మొద‌ల‌వుతుంది. అక్క‌డ కాఫీ ఎస్టేట్‌కి అధిప‌తి అయిన కృష్ణ‌మూర్తి (స‌చిన్ ఖేడ్క‌ర్‌) విద్యాసంస్థ‌ల్ని న‌డుపుతుంటాడు. త‌న మ‌న‌వ‌రాలు వైష్ణ‌వి అంటే ప్రాణం. చిన్న‌ప్పుడే త‌ల్లి చ‌నిపోవ‌డంతో ఆ పాపని  కుటుంబ‌మంతా అల్లారు ముద్దుగా పెంచుతుంటుంది. అలాంటి వైష్ణ‌వి ప్రాణాల‌కి లోక‌ల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు (ర‌వికిష‌న్‌) నుంచి ముప్పు ఏర్ప‌డుతుంది. దాంతో ఆ ఇంట్లోనే ప‌నిచేస్తున్న త‌న సైన్యం నుంచి భోపాల్‌లో ఉన్న మ‌హారాజ్ (బాల‌కృష్ణ‌)కి వ‌ర్త‌మానం అందుతుంది. వైష్ణ‌విని కంటికి రెప్ప‌లా కాపాడ‌తాన‌ని మాట ఇచ్చిన మ‌హారాజ్ త‌న పేరుని నానాజీగా మార్చుకుని రంగంలోకి దిగుతాడు. ఇంత‌కీ ఈ మ‌హారాజ్ ఎవ‌రు?భోపాల్‌లో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?(Daku Maharaaj) వైష్ణ‌వికీ, ఆయ‌న‌కీ సంబంధం ఏమిటి?ఈ క‌థ‌తో బ‌ల్వంత్ ఠాకూర్ (బాబీ దేవోల్‌), నందిని (శ్ర‌ద్ధా శ్రీనాథ్), కావేరి (ప్ర‌జ్ఞా జైస్వాల్‌)ల‌కు సంబంధం ఏమిట‌నే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Updated Date - Feb 16 , 2025 | 01:08 PM