CM PK: డిప్యూటీ సీఎం కాదు.. సీఎం పీకే
ABN , Publish Date - Feb 09 , 2025 | 08:44 PM
పీకేని సీఎం పీకే చేసేశారు. దీని వెనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. షాక్ అవుతున్నారా!? ఇంతకు ఏం జరిగిందంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(PSPK) ఎక్కడికెళ్లినా సీఎం, సీఎం అనే స్లొగన్స్ వినిపిస్తుంటాయి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న.. ఆయన అభిమానులు మాత్రం సీఎం, సీఎం అంటూ అనేక వేదికలపై రచ్చ చేసిన సందర్భాలు కోకొల్లలు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రయత్నించినా.. విఫలమయ్యారనే చెప్పాలి. ఇదిలా ఉండగానే సీఎం పీకే అనే ఓ అనౌన్స్‌మెంట్ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకు ఏం జరిగిందంటే..
'సీఎం పీకే' ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్. సడెన్ గా ఈ టాపిక్ వైరల్ ఎందుకు అయ్యిందంటే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా(Aha) తాజాగా 'సీఎం పీకే' అనే అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. దీనికి క్యాప్షన్‌గా మోస్ట్ పవర్ ఫుల్ ఎంటటైన్మెంట్ త్వరలోనే మీ ముందుకు రానుందంటూ రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఏ ఇతర వివరాలను జోడించలేదు. దీంతో ఇది సినిమానా? సిరీసా? అనే క్లారిటీ రాలేదు. దీనికి సీఎం పీకే అనే టైటిల్ పెట్టడం మాత్రం విపరీతమైన బజ్ కు కారణమవుతోంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు ‘హరిహర వీరమల్లు’ షూట్‌లోనూ ఆయన పాల్గొంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఆఖరి షెడ్యూల్ బుధవారం నుండి ప్రారంభం అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కానీ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన.. ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. అందులోనూ చాలా కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరపాల్సి ఉండటంతో, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అందుకు సహకరించదని, ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్స్ సూచించినట్లుగా సమాచారం.