OTT Records: ఒకటి అంతర్జాతీయంగా.. మరొకటి జాతీయంగా.. 

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:09 PM

‘సిటడెల్‌: హనీ బన్నీ’, ‘మీర్జాపూర్‌ 3’ ఈ రెండు సిరీస్‌లు రికార్డులు క్రియేట్‌ చేశాయి. ఒక సిరీస్‌ గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటగా మరొకటి జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపు తెచ్చుకుంది.


సమంత(Samantha), వరుణ్‌ ధావన్‌ (varun Dhawan) నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ (Citadel). అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన సిరీస్‌ వ్యూస్‌ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. అలాగే, క్రేౖమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మీర్జాపూర్‌ 3’ (Mirzapur 3) కూడా అమెజాన్‌లో  అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ రెండు సిరీస్‌లు రికార్డులు క్రియేట్‌ చేశాయి. ఒక సిరీస్‌ గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటగా మరొకటి జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపు తెచ్చుకుంది.

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘సిటడెల్‌ : హనీ బన్నీ’లో 80-90 ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఏంటి అనేది చూపించారు. హనీ పాత్రలో సమంత మెప్పించారు. తన కుమార్తె నదియాను రక్షించుకొనే తల్లి పాత్రలో ఆమె కన్పించారు. ఇప్పుడీ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఆకర్షించింది. (Citadel: Honey Bunny records) . గ్లోబల్‌ స్థాయిలో ఎక్కువమంది చూసిన నాన్‌ ఇంగ్లీష్‌ సిరీస్‌ల లిస్ట్‌లో టాప్‌ 10లో స్థానం  సొంతం చేసుకుంది. 170 దేశాల్లో ఈ సిరీస్‌ టాప్‌ 10లో ఉండడం విశేషం.


దేశవ్యాప్తంగా అత్యధిక వ్యూస్‌ తీసుకొచ్చిన ప్రైమ్‌ వీడియోల జాబితాలో ‘మీర్జాపూర్‌ 3’ టాప్‌ 10లో స్థానంలో ఉంది. ప్రైమ్‌ వీడియోలో విడుదలైన వారాంతంలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది. ఇక ఈ సిరీస్‌ విడుదలైనప్పుడు కూడా పలు రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన ‘మీర్జాపూర్‌ 2’ రికార్డును సైతం బద్దలు కొట్టి.. 85 దేశాల్లో టాప్‌ 10 లిస్ట్‌లో నిలిచింది.

Updated Date - Jan 30 , 2025 | 04:12 PM