Ott Streaming: ఓటీటీలో.. మోహన్‌లాల్‌ దర్శకత్వం వహించిన బరోజ్‌..

ABN , Publish Date - Jan 22 , 2025 | 03:36 PM

కరోనాకు ముందు ప్రారంభమైన చిత్రం పలు కారణాల చేత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ప్రేక్షకులు, మోహన్‌లాల్‌ అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.

మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ (Mohan Lal) హీరోగా నటించిన తాజా సినిమా ‘బరోజ్‌ 3డి’ (Barroz 3D). ఇన్నేళ్ల కెరీర్‌ ఆయన నటించి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కరోనాకు ముందు ప్రారంభమైన చిత్రం పలు కారణాల చేత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ప్రేక్షకులు, మోహన్‌లాల్‌ అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. పిల్లలకు నచ్చే ఫాంటసీ వండర్‌గా ఉండటం, త్రీడీలో తెరకెక్కడంతో చిన్నారుల నుంచి ఈ సినిమాకు ఆదరణ బాగానే ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంను ప్రముఖ స్ట్రీమింగ్  సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ (Disney plus hotstar) హక్కులను సొంతం చేసుకుంది. బుధవారం నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. ఒరిజినల్‌ మళయాళం సహా తెలుగు ఇతర పాన్‌ ఇండియా (Pan India movie) భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్‌లో మిస్‌ అయిన వారు.. ఇంట్లోనే ఓటీటీ వేదికగా (OTT Streaming) ఈ చిత్రాన్ని చూడొచ్చు. కథ పరంగా సినిమా కాస్త డల్‌ అయినా సినిమా క్వాలిటీ, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, త్రీడీ ఎఫెక్ట్స్‌ అలరించేలా ఉన్నాయి. 

ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీసు రాజు డి గామా వంశానికి చెందిన నిధి చుట్టూ సాగే కథ ఇది. రాజుకి నమ్మిన బంటు అయిన బరోజ్‌ (మోహన్‌ లాల్‌) నాలుగు శతాబ్దాలుగా నిధిని కాపాడుతూ వస్తుంటాడు. డి గామా వారసులు వస్తే వాళ్లకి నిధిని అప్పగించడానికి ఎదురు చూస్తుంటాడు. ఎట్టకేలకి రాజవంశం పదమూడో తరానికి చెందిన ఇసబెల్లా (మాయా రావు) తన తండ్రితో కలిసి గోవా వస్తుంది. మరి ఆమెకి బరోజ్‌ నిధిని అప్పగించాడా? లేదా? 400 ఏళ్లుగా బరోజ్‌ ఆ నిధిని ఎలా కాపాడుతూ వచ్చాడు? ఇసబెల రాజవంశానికి చెందిన యువతి అని అతడికి ఎలా తెలిసింది? అన్నది తెరపైనే చూడాలి.

Updated Date - Jan 22 , 2025 | 04:46 PM