Brahmaji: రెండు వారాల్లోనే ఓటీటీలో... ఇదేంటి 'బాపు'
ABN , Publish Date - Mar 01 , 2025 | 11:52 AM
చిన్న సినిమాలకు థియేటర్లలో మరీ గడ్డుకాలం ఎదురైంది. పట్టుమని పది రోజులు కూడా అవి ఆడటం లేదు. దాంతో రెండోవారంలోనే తమ చిత్రాలను ఓటీటీలో ప్రదర్శిస్తున్నారు నిర్మాతలు.
చిన్న సినిమాల థియేట్రికల్ రన్ రోజు రోజుకూ పడిపోతోంది. చిత్రం ఏమంటే... కొన్ని సినిమాలను విడుదల చేసిన రోజునే నాలుగు ఆటలు కూడా ప్రదర్శించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కంటెంట్ బేస్డ్ మూవీస్ కొన్ని ఎలాగొలా ఒకటి రెండు వారాలు థియేటర్లలో ఉంటున్నాయి. కానీ... ప్రజాదరణ పొందని చిత్రాల పరిస్థితి దారుణంగా ఉంది. 'స్టార్ హీరోల చిత్రాలను చూడటానికే జనం థియేటర్లకు రాని ఈ రోజుల్లో... చిన్న చిత్రాలను ఎందుకు థియేటర్లలో చూడాలనుకుంటారు!?' అనే మాట బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలను రెండో వారికే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే చేస్తున్నాడు. ఆ జాబితాలో బ్రహ్మాజీ (Brahmaji) నటించిన 'బాపు' (Baapu) కూడా చేరిపోయింది.
బ్రహ్మాజీ, ఆమని (Amani) జంటగా నటించిన 'బాపు' సినిమాను దయా తెరకెక్కించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 'బలగం' సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas), ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna), గంగవ్వ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రైతులు... వారి సమస్యలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోని భావోద్వేగాలు... వీటికి దర్శకుడు దయా పెద్ద పీట వేశారు. ఆర్. ఆర్. ధ్రువన్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు రాజు, భానుప్రసాద్ ఈ మూవీని సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో 149 రూపాయలకు ప్రదర్శించారు. ఈ కథ నచ్చి తాను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఇందులో నటించానని బ్రహ్మాజీ సైతం చెప్పారు. అయినా ఆశించిన స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఇక ఇప్పుడు మార్చి 7 న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read: Nagabandham: ఆసక్తి రేపుతున్న అనసూయ పోస్ట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి