Web Series : ఆగనంటున్న అలియా భట్

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:47 AM

అలియా భట్ చిత్ర నిర్మాణంతో పాటు వెబ్ సీరిస్, ఓటీటీ కంటెంట్ మీద కూడా దృష్టి నిలిపింది. ప్రస్తుతం యూత్ ఫుల్ అడల్ట్ వెబ్ సీరిస్ ను అలియా నిర్మిస్తోందట.

ప్రముఖ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత అలియా భట్ (Alia Bhatt) కు ఫిల్మ్ ప్రొడక్షన్ విషయంలోనూ మంచి పేషన్ ఉంది. అందుకే తాను ప్రధాన పాత్ర పోషించిన 'జిగ్రా' (Jigra) సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించింది. తెలుగు వారికి 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీతో చేరువైన కారణంగా అలియా భట్ 'జిగ్రా'ను తెలుగులో డబ్ చేసి, భారీ స్థాయిలో విడుదల చేసింది. కరణ్ జోహార్ (Karan Johar) తో కలిసి నిర్మించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా... నిర్మాతగా తన అడుగులు ముందుకే అని చెబుతోంది అలియా భట్.


ప్రస్తుతం అలియాభట్ 'ఆల్ఫా', 'లవ్ అండ్ వార్' చిత్రాలలో నటిస్తోంది. ఓ పక్క నటిస్తూనే మరో పక్క ప్రొడక్షన్ వ్యవహారాలనూ చక్కబెడుతోంది. తన సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ను ముందుకు తీసుకెళుతోంది. తాజాగా యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఓ అడల్ట్ వెబ్ సీరిస్ ను అలియా నిర్మించబోతున్నట్టు ముంబై సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయ్యిందని, అమెజాన్ ప్రైమ్ తో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. రెండు యువ జంటల మధ్య ఈ కథ సాగుతుందట. వెబ్ సీరిస్ రియలిస్టిక్ గా ఉండాలనే ఉద్దేశ్యంలో వీలైనంత వరకూ కొత్త వారినే అలియా టీమ్ ఎంపిక చేసిందని అంటున్నారు. ఇదే కాకుండా మంజు కపూర్ రాసిన 'డిఫికల్ట్ డాటర్స్' నవల ఆధారంగానూ ఓ ప్రాజెక్ట్ ను అలియా రెడీ చేస్తోందట. అలానే అలియా సోదరి షహీన్ భట్ కూడా ఎటర్నల్ సన్ షైన్ బ్యానర్ లో ఓటీటీ కోసం ఓ షో ను ప్లాన్ చేస్తోందని సమాచారం. మరి నిర్మాతగా వెండితెరపై సక్సెస్ అందుకోలేకపోయిన అలియా భట్... ఈ వెబ్ సీరిస్, షోస్ తో అయిన లాభాలను పొందుతుందేమో చూడాలి.

Also Read: Kesari -2: అక్షయ్ కుమార్ చిత్రం నుండి ఉత్తేజభరిత గీతం

Also Read: Nani Vs Suriya: మే1న మోస్ట్ వయొలెంట్ మూవీస్

Also Read: Balakrishna : బోయపాటితో చెడిందా!?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 14 , 2025 | 11:47 AM