Agent: అఖిల్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో...
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:42 PM
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' మూవీ 2023 ఏప్రిల్ నెలాఖరులో విడుదలైంది. ఆ తర్వాత ఇంతవరకూ మరే చిత్రాన్ని ఈ యంగ్ హీరో చేయలేదు. చిత్రం ఏమంటే అప్పటి ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
బాక్సాఫీస్ బరిలో వరస పరాజయాలను పొందిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇప్పుడు కాస్తంత సేద తీర్చుకుంటున్నాడు. పైగా ఈ యేడాది అతను పెళ్ళిపీటలెక్కబోతున్నాడు. ఇదిలా ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుని అఖిల్ చేసిన 'ఏజెంట్' (Agent) మూవీ బాక్సాఫీస్ బరిలో చేదు ఫలితాన్ని అందించింది. అయితే ఈ గూఢచారి చిత్రం మేకింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. రికీ అనే టాలెంటెడ్ రా ఏజెంట్ గా అఖిల్ ఇందులో నటించాడు. ఇందులో మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) రా చీఫ్ కల్నల్ మహాదేవ్ గా నటించారు. అలానే మాజీ రా ఏజెంట్ ధర్మ అలియాస్ గాడ్ గా బాలీవుడ్ నటుడు డినో మోరియా (Dino Morea) యాక్ట్ చేశాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీశర్మ, డెంజిల్ స్మిత్, విక్రమ్ జీత్ విర్క్ కీలక పాత్రలు పోషించారు. వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథను అందించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి (Surender Reddy) డైరెక్ట్ చేశారు. రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపారెడ్డి దీని నిర్మాతలు.
సహజంగా ఏ సినిమా అయినా బాక్సాఫీస్ బరిలో పరాజయం పాలైతే... రెండు, మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతోంది. కానీ చిత్రంగా 'ఏజెంట్' ఓటీటీలో రావడానికి ఏకంగా 685 రోజులు పడుతోంది. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేశారు. ఇంతకాలానికి ఇది మార్చి 14న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అప్పుడు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఓటీటీలో దీనిని చూడొచ్చు.
Also Read: Allu Arjun: కసరత్తుల వెనుక అసలు కారణం
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి