Power Stars: ఇద్దరు... పవర్ స్టార్స్...
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:27 PM
తమిళ హీరో విజయ్ నటించిన చిత్రాలు కొన్ని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన బాటలో విజయ్ సైతం పార్టీ పెట్టి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు.
తెలుగునాట పవర్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని వినిపిస్తుంది. తమిళనాట అదే మాటకు విజయ్ (Vijay) పేరు మన చెవులకు సోకుతుంది. పవన్ కళ్యాణ్, విజయ్ హైదరాబాద్ లో ఓ షూటింగ్ సమయంలో ఇలా కలుసుకున్నారు. వారి ముచ్చట్లు వింటూ మధ్యలో ఉన్నది త్రిష (Trisha). ఈ ఇద్దరు పవర్ స్టార్స్ కు చిత్రానుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "సుస్వాగతం (Suswagatham), ఖుషి (Khushi), అన్నవరం (Annavaram) " చిత్రాలకు తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన "లవ్ టుడే (Love today), ఖుషి, తిరుపాచ్చి" సినిమాలే ఆధారం. మొదటి రెండు చిత్రాలు తమిళనాడులో కన్నా మిన్నగా తెలుగునాట విజయం సాధించాయి. 'అన్నవరం' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
2014లోనే తెలుగు పవర్ స్టార్ 'జనసేన' (Janasena) పార్టీ పెట్టారు. ఓ సారి పరాజయం, ఇప్పుడు విజయం పొంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానూ ఉన్నారు. సరిగా పదేళ్ళకు అంటే 2024లో తమిళ పవర్ స్టార్ 'తమిళగ వెట్రి కళగమ్' అనే పార్టీని నెలకొల్పి, రాబోయే తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలో దూకనున్నారు. మరి ఈ పవర్ స్టార్ ఎలాంటి ఫలితం చూస్తారో?
Also Read: OTT: కాంట్రవర్షియల్ తమిళ చిత్రం ఓటీటీలో!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి