NTR n ANR: భలే బంధం...
ABN , Publish Date - Mar 17 , 2025 | 06:28 PM
ఎన్టీఆర్, ఎఎన్నార్ కాంబినేషన్ లో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అలాంటి కాంబినేషన్ న భూతో న భవిష్యతి అనిపించుకుంది.
యన్టీఆర్ (NTR) నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏయన్నార్ (ANR) అభినందిస్తున్న సమయంలోని పిక్ ఇది. వారిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడగానే అభిమానులకు పలు విషయాలు గుర్తుకు వస్తూంటాయి. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండేవారు. వారి మధ్య తలెత్తిన వివాదాలు టీ కప్పులో తుఫానులా కరిగిపోయాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న రోజుల్లో వారిద్దరూ ఒకరి సొంత సంస్థలో మరొకరు పనిచేయలేదు. కాస్త ఎడబాటు, ఆ తరువాత కలుసుకోవడం జరిగాక యన్టీఆర్ సొంత సంస్థ రామకృష్ణా సినీస్టూడియోస్ నిర్మించిన 'చాణక్య-చంద్రగుప్త'లో ఏయన్నార్ చాణక్యునిగా నటించారు. ఏయన్నార్ సొంత సంస్థ అన్నపూర్ణ సినీ స్టూడియోస్ భాగస్వామ్యంలో రూపొందిన 'రామకృష్ణులు'లో రామారావు రాముగా అభినయించారు. ఆ పై యన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మించిన 'సత్యం-శివం'లోనూ కలసి నటించారు. అందుకే అంటారు - పోట్లాట తరువాతే బంధం బలంగా ఉంటుందని!
Also Read: RC 16: 'ఆర్‌సీ 16'లో చిరంజీవి సర్జా భార్య
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి