Tollywood: ఎవరో కనుక్కోండి చూద్దాం!
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:39 AM
తెలుగు సినిమా రంగాన్ని సుసంపన్నం చేసిన చేసిన ఎంతోమంది గుణ చిత్ర నటులు ఉన్నారు. వారిలో ఈయనా ఒకరు!
ఏ 'యాస'మీదైనా ధ్యాస పెట్టి మరీ సదరు ప్రాంతాలవారిని ఆశ్చర్యంలో ముంచి శ్వాస తీసుకోకుండా చేసిన ఘనుడు! 'ఏండే..' అంటూ ఎకసెక్కాలు ఆడినా, 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ...' అంటూ బ్యాచ్ లర్స్ ను హెచ్చరించినా ఆయన బాణీని తెలుగువారు అంత ఈజీగా మరచిపోలేరు. అంతలా అలరించిన ఈ నటమార్తాండుడు ఒకానొక దశలో రోజుకు మూడు నాలుగు షిఫ్టులు చేశారు. ఊపిరి తీసుకోలేనంత బిజీగా సాగినా, తనకు లభించిన పాత్రలోకి చప్పున పరకాయ ప్రవేశం చేసేవారు. ఒకప్పుడు ఆయనలేని సినిమాలు చాలా తక్కువ. వయసు మీద పడడంతో సినిమాల్లో ఆయన తక్కువగా కనిపిస్తున్నారు. ఇంతకూ ఆయనెవరో గుర్తు పట్టారా!?
Also Read: Manchu Family: మరోసారి విష్ణుపై మనోజ్ మాటల యుద్ధం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి