గురువు షష్టి పూర్తి... శిష్యుల విందు భోజనం...
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:18 PM
'కత్తి' కాంతారావుగా జనం మదిలో నిలిచారు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (T L Kanta Rao). టాకీ పులి హెచ్.ఎమ్.రెడ్డి (H M Reddy) తన 'నిర్దోషి' సినిమాలో ఓ చిన్న వేషం ఇచ్చారు కాంతారావుకు.
'కత్తి' కాంతారావుగా(kathi Kantarao) జనం మదిలో నిలిచారు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (T L Kanta Rao). టాకీ పులి హెచ్.ఎమ్.రెడ్డి (H M Reddy) తన 'నిర్దోషి' సినిమాలో ఓ చిన్న వేషం ఇచ్చారు కాంతారావుకు. ఆ పాత్రలో కాంతారావు ఎంతో చాకచక్యంగా నటించడంతో తరువాత వై.ఆర్.స్వామి దర్శకత్వంలో తాను నిర్మించిన 'ప్రతిజ్ఞ'తో హీరోని చేశారు హెచ్.ఎమ్.రెడ్డి. 'ప్రతిజ్ఞ' జానపద చిత్రం కావడం, అందులో కాంతారావు, రాజనాల కత్తియుద్ధంతో అలరించడం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ పై స్వామి దర్శకత్వంలోనే హెచ్.ఎమ్. రెడ్డి యన్టీఆర్ హీరోగా 'వద్దంటే డబ్బు' నిర్మించారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇందులో కాంతారావు అతిథి పాత్రలో కనిపించారు. తన గురువు హెచ్.ఎమ్.రెడ్డి అంటే కాంతారావుకు వల్లమాలిన అభిమానం. 1892లో జన్మించిన హెచ్.ఎమ్.రెడ్డి షష్టి పూర్తి వేడులు 1952లో జరిగాయి. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో కాంతారావు తన మిత్రులు కె.వి.రావు, లక్ష్మీకుమార్ తో కలసి భోంచేస్తున్న దృశ్యమిది. కేవీ రావు కూడా హెచ్.ఎమ్.రెడ్డి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వారే. కాంతారావుకు కుడివైపు కూర్చుని విందారగిస్తున్న కేవీ రావు తరువాతి రోజుల్లో బాపు తీసిన అనేక చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారు.