Maheshbabu: 'అతడు'... డి.కిశోర్!

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:42 PM

నటుడు, నిర్మాత మురళీమోహన్ వెనుక ఉన్న 'అతడు' డి. కిశోర్! ఆయన గురించిన ఆసక్తికరమైన విషయం.

ఇక్కడ మహేశ్ బాబు (Mahesh Babu) తో కనిపిస్తున్నది జయభేరి ప్రొడక్షన్స్ అధినేత డి.కిశోర్. నటుడు మురళీమోహన్ (Murali Mohan) కు తమ్ముడవుతారు. మహేశ్ బాబుతో 'అతడు' (Athadu) నిర్మించారు కిశోర్. మహేశ్ సినిమాల్లో 'అతడు' ఓ స్పెషల్. ఎందుకంటే 'అతడు' చిత్రవిచిత్రంగా ఆడింది. చాలా సెంటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఈ సినిమా హైదరాబాద్ లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ చూసింది. అంతేనా అంటే ఇంకా ఉంది. 'అతడు' సినిమా నిజానికి నిర్మాతకు లాస్ ప్రాజెక్ట్. అయితే ఇదే చిత్రం తరువాత బుల్లితెరపై భలేగా సందడి చేస్తూ సాగింది. నిర్మాత కిశోర్ కు అప్పుడు వచ్చిన లాస్ ను పూడ్చేసింది. అదనంగా మరికొంత సొమ్మునూ సంపాదించి పెట్టింది 'అతడు'. కారణమేంటో కానీ, 'అతడు' తరువాత కిశోర్ సినిమాలకు దూరం జరిగారు.

Also Read: Big War: సీనియర్ స్టార్స్ వర్సెస్ యంగ్ హీరోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 03:43 PM